హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేసింగ్

హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేసింగ్

ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ ఖ్యాతి మరోసారి మార్మోగిపోనుంది. ప్రముఖ నగరాల చూపు మన రాజధాని నగరంపై పడనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఫార్ములా – ఈ రేసింగ్ కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుండటమే అందుకు కారణం. ఎఫ్ – ఈకి తెలంగాణ సర్కారు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఏస్ అర్బ‌న్ రేస్ కంపెనీ ప్ర‌మోట‌ర్ గా పూర్తి స‌హ‌కారాన్ని అందిస్తోంది.

ఈ రేసింగ్ లేదా ఫార్ములా – ఈ. కొంత కాలంగా బాగా వినిపిస్తున్న పేరు. ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవుతున్న క్రీడ. సాధారణంగా FIA నిర్వహించే ఫార్ములా వన్ గురించే మనకు ఎక్కువగా తెలుసు. అయితే ఫార్ములా – ఈ కూడా FIA ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఎఫ్ – 1లో పెట్రోల్, గ్యాస్, డీజిల్ తో న‌డిచే ఇంట‌ర్న‌ల్ కంబ‌స్ట‌న్ ఇంజిన్ వెహికిల్స్ ను వాడతారు. ఎఫ్ – ఈలో మాత్రం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే వినియోగిస్తారు. అంటే సంప్ర‌దాయ రేసింగ్ కోసం ఫార్ములా – 1 … ఎల‌క్ట్రిక్ కార్ల కోసం ఫార్ములా – ఈ రేసింగ్ నిర్వహిస్తారని చెప్పొచ్చు.

వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు న్యూయార్క్, లండ‌న్, ప్యారిస్, రోమ్ వంటి 12 నగరాల్లో మాత్రమే ఫార్ములా – ఈ రేసింగ్ జరుగుతోంది. ఇప్పుడు వాటి సరసన హైదరాబాద్ కూడా నిలవనుంది. 2023 ఫిబ్రవరి 11న ఎఫ్ – ఈ వరల్డ్ చాంపియన్ షిప్ రేస్ ను ఇక్కడ నిర్వహించనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ పోటీల కోసం తెలంగాణ సర్కారు భారీ ఏర్పాట్లు చేస్తోంది. హుస్సేన్ సాగర్ లేక్, లుంబినీ పార్క్, సెక్రటేరియట్ సర్క్యూట్ గా … 2.37 కిలో మీటర్ల ట్రాక్ ను అందుబాటులో ఉంచనుంది.

Poultary

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద నగరాల సరసన హైదరాబాద్ ను చేర్చాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దీనిలో భాగంగానే ఎఫ్ – ఈకి ఆథిత్యం ఇచ్చేందుకు సన్నద్ధమైంది. ఎలక్ట్రిక్ వెహికల్ రెవెల్యూష‌న్ కు ఇది మరింత ఊతమిస్తుంది. హైదరాబాద్ … అంత‌ర్జాతీయ స్థాయి న‌గ‌రం అని ప్రపంచానికి తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర సత్తా ఏంటో చాటి చెప్పేందుకు ఎఫ్ – ఈ రేస్ దోహదపడుతుంది.

ఫార్ములా – ఈ లో ఇప్ప‌టికే 2 ఇండియ‌న్ టీమ్స్ ఉన్నాయి. ఒకటి టాటా రెండోది మ‌హీంద్ర‌. వీటితో పాటు ప్రముఖ కంపెనీలు రేసింగ్ లో అదృష్టాన్ని పరిష్కరించుకోనున్నాయి. ఎఫ్ – ఈ రేస్ వల్ల హైదరాబాద్ లో టూరిజం మరింత మెరుగుపడనుంది. విదేశీ పర్యాటకుల సంఖ్య పెరగనుంది. భ‌విష్య‌త్ లో హైద‌రాబాద్ లోని వేర్వేరు ప్రాంతాల్లో ఫార్ములా -ఈ నిర్వహించేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. 2023లో ఎఫ్ – ఈతో పాటు అతిపెద్ద ఈవీ స‌మ్మిట్, ఎల‌క్ట్రిక్ కార్స్ & బైక్స్ షో నిర్వహించేందుకు రెడీ అవుతోంది.

మరోవైపు, మన దేశంలోనే తొలిసారిగా జరగనున్న ఫార్ములా – ఈ రేసింగ్ ను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఎఫ్ – ఈని గ్రాండ్ సక్సెస్ చేసేందుకుగానూ రెండు కమిటీలను నియమించింది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చైర్మన్ గా మేనేజింగ్ కమిటీ … మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేసింది.

మొత్తమ్మీద ఫార్ములా – ఈ రేసింగ్ తో హైదరాబాద్ పేరు మార్మోగిపోనుంది. ఎఫ్ – ఈ నిర్వహించే అంతర్జాతీయ నగరాల జాబితాలో భాగ్యనరానికి చోటు దక్కనుంది. అయితే అలాంటి అద్భుతమైన క్షణాలను చూడాలంటే మరో 7 నెలలు వేచి చూడాల్సిందే.

                                                                                             – పి. వంశీకృష్ణ

ALSO READ: బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్‌కు లక్షన్నర కోట్ల విరాళం ప్రకటించిన బిల్‌ గేట్స్‌

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here