IGBC Green Property Show
IGBC Green Property Show

ప్ర‌తిష్టాత్మ‌క IGBC Green Property Show సెకండ్ ఎడిష‌న్ కు అంతా సిద్ధ‌మైంది. హైద‌రాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిష‌న్ సెంట‌ర్ లో ఈ నెల 17 నుంచి 19వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో IGBC Green Property Show చేప‌డుతున్నారు.

దీనికి సంబంధించిన పోస్ట‌ర్ లాంఛ్ హైద‌రాబాద్ లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ సి.

శేఖర్ రెడ్డి, ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ కో-ఛైర్మన్ శ్రీనివాస్ మూర్తి ప్రసంగించారు. ఐజీబీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. ఆనంద్, ఐజీబీసీ సీనియర్ కౌన్సెలర్ సందీప్ వుల్లికంటి తదితరులు పాల్గొన్నారు.

Poultary

ఈ నెల 17 నుంచి 19వ తేదీల్లో ఉద‌యం 10 నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ప్రాప‌ర్టీ షో జ‌రుగుతుంది. తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్ర వ్యాప్తంగా హ‌రిత కార్య‌క్ర‌మాల‌ను ప్రోత్స‌హిస్తోంది.

అందుకు అనుగుణంగా.. పర్యావరణ పరిరక్షణ, వనరుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన క‌ల్పించేందుకు, గ్రీన్ బిల్డింగ్ పద్ధతులను ప్రోత్స‌హించేందుకు ఈ ప్రాప‌ర్టీ షో దోహ‌ద‌ప‌డుతుంది.

ది కీ టు ఎ గ్రీన్ ఫ్యూచర్:

‘ది కీ టు ఎ గ్రీన్ ఫ్యూచర్’ IGBC Green Property Show కాన్సెప్ట్. ఇది ప్రజలను వారి పిల్లలు, రాబోయే తరాలకు సుస్థిరమైన భవిష్యత్తును పొందేందుకు గ్రీన్ హోమ్‌లను కొనుగోలు చేయాల్సిందిగా ప్రోత్సహిస్తుంది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిరమైన అభ్యాసాల గురించి వినూత్నంగా ఆలోచించేలా చేస్తుంది.

లివింగ్ కమ్యూనిటీలో ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపడం, ఖర్చు & ఇంధన ఆదా, సహజ వనరుల వినియోగం, ఇతర సుస్థిరమైన ప్రయోజనాలు – నీరు, గాలి, వెలుతురు, వ్యర్థాల నిర్వహణ మొదలైన వాటిపై అవ‌గాహ‌న క‌ల్పిస్తుంది.

హైదరాబాద్ పౌరులు చూపిన ఆసక్తి కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్టులకు డిమాండ్ ఏర్ప‌డింది.

హరిత భవనాలు, సుస్థిరమైన జీవన విధానాలపై దృష్టి పెట్టడం కేవలం ఒక ట్రెండ్ మాత్రమే కాదు, రాబోయే తరాల కోసం సహజ వనరులను కాపాడే ప్ర‌క్రియ‌లో కీలకమైన పెట్టుబడి. నివాసయోగ్యమైన వాతావరణం కోసం ప్ర‌జ‌ల‌ ప్రాథమిక అవసరాలను తీర్చగల ప్రపంచాన్ని వారసత్వంగా పొందేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది సుస్థిరమైన, సమానమైన భవిష్యత్తుకు బాటలు వేస్తుంది.

ప్రాపర్టీ యజమానులు, కాబోయే కొనుగోలుదారులు, మదుపరులు, అద్దెదారులు, అన్ని పరిశ్రమల వాటాదారులకు గ్రీన్ ప్రాపర్టీ షో అందుబాటులో ఉంటుంది.

ఈ ప్రాపర్టీ షో ప్రముఖ డెవలపర్లకు సరైన ప్లాట్ ఫామ్ గా ఉపయోగపడుతుంది. కొనుగోలుదారులను కలుసుకునేందుకు, గ్రీన్ సర్టిఫైడ్ ప్రాపర్టీలను ప్రోత్స‌హిచేందుకు దోహ‌ప‌డుతుంది. గ‌తేడాది కంటే ఈ సారి ప్రాప‌ర్టీ షో మ‌రింత‌గా ఆక‌ట్టుకోనుంది.

కాగా, ఐజిబిసి గ్రీన్ ప్రాపర్టీ షో 2వ ఎడిషన్ ను నిర్వ‌హిస్తుండ‌టం ప‌ట్ల ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ సి. శేఖర్ రెడ్డి సంతోషం వ్య‌క్తం చేశారు.

ఈ అవ‌కాశాన్ని డెవ‌ల‌ప‌ర్లంద‌రూ సద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. మొద‌టి ఎడిష‌న్ విజ‌య‌వంత‌మైంద‌ని ఈ ఎడిష‌న్ ను కూడా సక్సెస్ చేయాల‌ని ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ కో-ఛైర్మన్ శ్రీనివాస్ మూర్తి కోరారు.

- పి.వంశీకృష్ణ‌
Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here