Hyderabad Metro New Route Map
Hyderabad Metro New Route Map

హైద‌రాబాద్ న‌గ‌ర‌వాసుల‌కు గుడ్ న్యూస్. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రూట్ లో నాగోల్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో 13 మెట్రో స్టేష‌న్లు ఏర్పాటు కానున్నాయి.(Hyderabad Metro New Route Map)* హైద‌రాబాద్ మెట్రో అధికారులు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

ఈ రూట్ లో మెట్రో అలైన్ మెంట్, స్టేష‌న్ల స్థానాలు ఖ‌రారు చేసేందుకు క్షేత్ర స్థాయిలో ప‌రిశీల‌న చేశారు.*(Hyderabad Metro New Route Map)*

ప్ర‌స్తుతం ఉన్న నాగోల్ మెట్రో స‌మీపంలో మొద‌టి స్టేష‌న్ తో ఈ రూటు మొద‌ల‌వుతుంది. త‌ర్వాత నాగోల్ చౌర‌స్తా, అల్కాపురి చౌరస్తా, కామినేని ఆసుపత్రి, ఎల్బీనగర్‌, సాగర్‌ రింగ్ రోడ్డు, మైత్రీనగర్ స్టేష‌న్లుంటాయి. వాటి త‌ర్వాత కర్మన్ ఘాట్‌, చంపాపేట రోడ్‌, ఒవైసీ హాస్పిట‌ల్, డీఆర్ డీవో, హఫీజ్‌ బాబానగర్‌, చాంద్రాయణగుట్టలో మెట్రో స్టేష‌న్లు ఏర్పాటు చేస్తారు.

Poultary

Hyderabad Metro New Route Map

మెట్రో రూట్ లో మ‌రెన్నో ప్ర‌త్యేక‌త‌లు

– నాగోల్ లో ఇప్పుడు ఉన్న స్టేష‌న్ ద‌గ్గ‌ర్లో న్యూ నాగోల్‌ ఎయిర్ పోర్ట్‌ స్టేషన్ (ఎల్బీన‌గ‌ర్ రూట్ లో) రాబోతోంది.

– ఈ రెండింటినీ క‌లిపేలా విశాలమైన స్కైవాక్ నిర్మిస్తారు.

– మూసీ పునరుజ్జీవ పనులకు ఇబ్బంది లేకుండా పొడవైన స్పాన్ లు ఉండేలా ప్రణాళికలు

– మూసీ నదిపై మెట్రో వంతెనను నిర్మించాలని మెట్రో అధికారులు గుర్తించారు

*ఎల్బీన‌గ‌ర్ స్టేష‌న్ లో వాక‌లేట‌ర్*

ప్ర‌స్తుతం ప్ర‌తిపాదించిన ఎల్బీన‌గ‌ర్ జంక్ష‌న్ స్టేష‌న్ నుంచి ఇప్పుడున్న మెట్రో స్టేష‌న్ వ‌ర‌కు విశాల‌మైన స్కై వాక్ తో అనుసంధానం చేస్తారు. ఇందులోనే వాక‌లేట‌ర్ ఏర్పాటు చేస్తారు. హైద‌రాబాద్ లో ఇలాంటి వాక‌లేట‌ర్ మ‌రెక్క‌డా లేక‌పోవ‌డం విశేషం.

మెట్రో కొత్త రూట్ తో ప్ర‌యాణం మ‌రింత సౌక‌ర్య‌వంతంగా మార‌నుంది. నాగోల్ నుంచి చాంద్రాయ‌ణగుట్ట వ‌ర‌కు జ‌ర్నీ ఈజీ కానుంది. ల‌క్ష‌లాది మందికి ఈ స‌దుపాయం ఉప‌యోగ‌ప‌డ‌నుంది.

- పి.వంశీకృష్ణ
Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here