నేటి ప్ర‌ధానంశాలు

తెలంగాణ‌లో వ‌ర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కాస్త రిలీఫ్ ఇచ్చే విష‌య‌మిది. అదేంటో తెలుసుకునే ముందు తెలుగు నౌ ఛాన‌ల్ ను స‌బ్ స్క్రైబ్ చేయండి. ఇక మ్యాట‌రేంటంటే.. ఎండ‌లు దంచికొడుతున్నాయి క‌దా. వాటి నుంచి ఊర‌ట ల‌భించ‌నుంది. ఎందుకంటే రాష్ట్రంలోని ప‌లు చోట్ల మూడు, నాలుగు రోజుల‌పాటు వ‌ర్షాలు కువ‌ర‌నున్నాయి. వాతావ‌ర‌ణ శాఖ ఈ విష‌యాన్ని తెలిపింది. తెలంగాణ‌కు ఎల్లో అల‌ర్ట్ కూడా జారీ చేసింది. హైద‌రాబాద్, నిజామాబాద్, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, వికారాబాద్ త‌దిత‌ర ప్రాంతాల్లో వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయి. సో.. కాస్త జాగ్ర‌త్త‌గా ఉండండి.

అత్యంత క‌లుషిత రాజ‌ధానిగా ఢిల్లీ

దేశ రాజ‌ధాని ఢిల్లీ.. ప్ర‌పంచంలోనే అత్యంత క‌లుషిత‌మైన రాజ‌ధానిగా రికార్డుకెక్కింది. అక్క‌డి గాలి నాణ్య‌త అత్యంత అధ్వాన్నంగా మారింది. Swiss organization IQAir విడుద‌ల చేసిన World Air Quality Report 2023లో ఈ విష‌యం వెల్ల‌డైంది. వ‌ర‌ల్డ్ లోనే మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిట‌ల్ గా ఢిల్లీ ఇలాంటి రికార్డు మూట‌గ‌ట్టుకోవ‌డం ఇది నాలుగోసారి. ఇక‌, బీహార్‌లోని బెగుసరాయ్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది.

ఇండియాలో అతిచిన్న వ‌య‌సున్న మిలియ‌నీర్

ఇండియాలో అతిచిన్న వ‌య‌సున్న మిలియ‌నీర్ ఎవ‌రో తెలుసా? పోనీ త‌న ఏజ్ గెస్ చేయ‌గ‌ల‌రా? స‌రే చెప్తా చూడండి. ఆ బుల్లి మిలియ‌నీర్ పేరు ఏకాగ్ర‌హ రోహ‌న్ మూర్తి. వ‌య‌సు జ‌స్ట్ నాలుగు నెల‌లు. ఇంత‌కీ అత‌ను ఎవ‌ర‌నుకుంటున్నారు..? Infosys Co-Founder నారాయ‌ణ మూర్తి మ‌న‌మ‌డు. ఆ కంపెనీలో 15 ల‌క్ష‌ల షేర్ల‌ను నారాయ‌ణ‌మూర్తి… ఏకాగ్ర‌హ‌కు రాసిచ్చేశారు. వాటి విలువ 240 కోట్ల‌కు పై మాటే. దీంతో, ఈ కిడ్ ఇండియాలోనే అతి త‌క్కువ వ‌య‌సున్న మిలియ‌నీర్ గా మారిపోయాడు.

Poultary

అవును.. డ్ర‌**గ్స్ తీసుకున్నా: ఎలాన్ మ‌స్క్

త‌న‌పై వ‌స్తున్న డ్ర‌**గ్స్ ఆరోప‌ణ‌ల‌పై టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మ‌స్క్ స్పందించారు. మాద‌క ద్ర‌వ్యాలు తీసుకున్న‌ట్టు ఆయ‌న‌ అంగీక‌రించారు. డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు డాక్ట‌ర్ స‌ల‌హామేర‌కు డ్ర‌**గ్స్ వాడిన‌ట్టు చెప్పారు. గ‌తంలో కూడా మ‌స్క్ పై ఇలాంటి ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. 2018లో అమెరిక‌న్ పాడ్ కాస్ట‌ర్ జో రోగ‌న్ షోకు మ‌స్క్ హాజ‌ర‌య్యారు. అప్పుడు ఆయ‌న గంజాయి పీల్చిన ఫొటో తెగ వైర‌ల్ అయింది.

త్వ‌ర‌లోనే షూటింగ్.. మ‌హేశ్ తో జ‌క్క‌న్న మూవీ

మ‌హేశ్ బాబు-రాజ‌మౌళి కాంబినేష‌న్ లో మూవీ రాబోతోంది. ప్ర‌స్తుతం జ‌పాన్ లో ఉన్న జ‌క్క‌న్న దీనికి సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. SSMB29 మూవీ ప్రీ-ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ మొద‌లైంది. దాదాపు 1000 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఇది రాబోతోంది. వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి చేసి జ‌పాన్ తో లో కూడా సినిమాను రిలీజ్ చేస్తామ‌ని రాజ‌మౌళి చెప్పారు. జ‌క్క‌న్న మాట్లాడిన ఆ వీడియో సోష‌ల్ మీడియాలో ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

- పి. వంశీకృష్ణ

Bharati Cement