ఈ వారం ఓటీటీల్లో తెలుగు వెబ్ సిరీస్ లు

ఈ వారం ఓటీటీల్లో తెలుగు వెబ్ సిరీస్ లు, సినిమాలు అల‌రించ‌నున్నాయి. మ‌రి అవేంటో, ఏయే Platformsలో విడుద‌ల కాబోతున్నాయో చూడండి.

New Age Romantic Comedy Entertainer గా వ‌చ్చిన వెబ్ సిరీస్ తుల‌సివ‌నం. Director Tharun Bhaskar Teamలో ప‌ని చేసిన అనిల్ రెడ్డి దీన్ని తెర‌కెక్కించారు. అక్షయ్, ఐశ్వర్య, వెంకటేష్, విష్ణు ప్రధాన పాత్రల్లో న‌టించిన తుల‌సివ‌నం మార్చి 21నుంచి ETV Winలో స్ట్రీమింగ్ కానుంది.

డిటెక్టివ్ జోనర్ లో వ‌చ్చిన భూతద్దం భాస్కర్ నారాయణ ఆహాలో ఈ నెల 22 నుంచి అందుబాటులోకి వ‌స్తోంది. క‌మెడియ‌న్ వైవా హ‌ర్ష హీరోగా న‌టించిన సుంద‌రం మాస్టార్‌ ETV Winలో అదే రోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Poultary

మ‌ణికంద‌న్, గౌరీ ప్రియ జంట‌గా న‌టించిన మూవీ ట్రూ ల‌వ‌ర్. ఫిబ్ర‌వ‌రిలో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రానుంది. మార్చి 27 నుంచి Disney Hotstarలో టెలికాస్ట్ కాబోతోంది. మ‌రి ఈ మూవీ ఏ మేర ఆక‌ట్టుకుంటుందో వేచి చూడాలి.

గ‌తేడాది ఆగ‌స్ట్ లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన యూత్ ఫుల్ ల‌వ్ స్టోరీ.. ఏం చేస్తున్నావ్. భ‌ర‌త్ మిత్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అంద‌రూ కొత్త‌వాళ్లే న‌టించారు. అయితే ఇది థియేట‌ర్ల‌లో ఆడియ‌న్స్ ను పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఇప్పుడు ETV Winలో మార్చి 28 నుంచి స్ట్రీమ్ అవ‌నుంది.

ఇవే కాకుండా ఛార్లీ 111, ఆప‌రేష‌న్ వాలెంటైన్, భీమా, గామి సినిమాలు కూడా త్వ‌ర‌లోనే ఓటీటీల్లో సంద‌డి చేయ‌నున్నాయి. మ‌రి వీక్ష‌కుల‌ను ఇవి అల‌రిస్తాయా? లేదా? చూద్దాం.

- పి. వంశీకృష్ణ
Bharati Cement