GRammy Awards 2024

Grammy Awards 2024: సినీ ఇండ‌స్ట్రీలో ఆస్కార్ కు ఎంత ప్రాధాన్య‌ముందో.. మ్యూజిక్ విభాగంలో గ్రామీకి అంతే ప్రాముఖ్య‌త ఉంది..! ప్ర‌తి ఏటా వీటిని అంద‌జేస్తార‌న్న‌ సంగ‌తి తెలిసిందే..! అలాంటి 66వ‌ గ్రామీ అవార్డ్స్ లో ఇండియ‌న్స్ స‌త్తా చాటారు. ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8 పుర‌స్కారాల‌ను కైవ‌సం చేసుకున్నారు. అమెరికా లాస్ ఏంజిల్స్ లో అవార్డ్స్ సెరిమొనీ అట్ట‌హాసంగా జరిగింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా వివిధ‌ కేటగిరీల్లో సాంగ్స్, మ్యూజిక్, వీడియో ఆల్బమ్స్ గ్రామీ అవార్డుల కోసం పోటీపడ్డాయి. పలువురు టాప్ ఆర్టిస్టులు వేదికపై లైవ్ ఫర్ఫార్మెన్స్ తో అద‌ర‌గొట్టారు.

భార‌తీయుల‌కు 8 పుర‌స్కారాలు..:

అంత‌ర్జాతీయ వేదిక‌పై భార‌తీయ క‌ళాకారులు మెరిశారు..! శంక‌ర్ మ‌హ‌దేవ‌న్, జాకీర్ హుస్సేన్ అద‌ర‌హో అనిపించారు. వీళ్లు కంపోజ్ చేసిన దిస్ మూమెంట్ కు Best Global Music Album అవార్డు ద‌క్కింది. దీన్ని శ‌క్తి అనే బ్యాండ్ పేరుతో కంపోజ్ చేశారు. ఇందులో శంక‌ర్ మ‌హ‌దేవ‌న్, జాకీర్ హుస్సేన్, సెల్వ గణేశ‌న్, జాన్ మెక్ లాగ్లిన్, గ‌ణేశ్ రాజ‌గోపాల‌న్ ఉన్నారు. ఇక‌, Best Global Music Performance Category లో పాస్తో ఆల్బ‌మ్ కుగానూ జాకీర్ హుస్సేన్ ను మ‌రో గ్రామీ వ‌రించింది. అటు, Best Contemporary Instrumental Album Category లో యాజ్ వి స్పీక్ ఆల్బ‌మ్ కు అవార్డు ద‌క్కింది. బెలా ఫ్లెక్, ఎడ్గర్ మేయర్, రాకేష్ చౌరాసియాతో క‌లిసి జాకీర్ హుస్సేన్ దీన్ని అందుకున్నారు.

మొత్త‌మ్మీద ఈ సారి ఐదుగురు భార‌తీయులు 8 గ్రామీ అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. అందులో ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ను 3, ప్ర‌ఖ్యాత ఫ్లూటిస్ట్ రాకేశ్ చౌరాసియాను 2 పుర‌స్కారాలు వ‌రించాయి. శంక‌ర్ మ‌హ‌దేవ‌న్, గ‌ణేశ్ రాజ‌గోపాల‌న్, సెల్వగ‌ణేశ్ వినాయ‌క్ రామ్ కు త‌లో అవార్డు ద‌క్కింది.

Poultary

వివిధ కేట‌గిరీల్లో గ్రామీ విజేత‌లు..:

  1. బెస్ట్ ర్యాప్ ఆల్బ‌మ్ – మైఖేల్‌ (కిల్లర్‌ మైక్‌)
  2. బెస్ట్ గ్లోబల్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ – శక్తి (దిస్ మూమెంట్‌)
  3. బెస్ట్ కామెడీ ఆల్బమ్ – డేవ్ చాపెల్ (వాట్స్ ఇన్ ఎ నేమ్)?
  4. బెస్ట్ మ్యూజికల్ థియేటర్ ఆల్బమ్ – సమ్ లైక్ ఇట్ హాట్
  5. బెస్ట్ రాక్ ఆల్బమ్ – పారామోర్ (దిస్ ఇజ్ వై)
  6. బెస్ట్ కంట్రీ సాంగ్ – క్రిస్ స్టేప్లెటన్ (వైట్ హార్స్)
  7. బెస్ట్ రాక్ సాంగ్ – బాయ్ జెనియస్ (నాట్ స్ట్రాంగ్ ఎనఫ్)
  8. బెస్ట్ మెట‌ల్ ప‌ర్ఫామెన్స్ – మెటాలికా (72 సీజన్స్)
- పి. వంశీకృష్ణ‌
Bharati Cement