ఇన్నోవేషన్ ఇండెక్స్ లో 2వ స్థానంలో తెలంగాణ

ఇన్నోవేషన్ ఇండెక్స్ లో 2వ స్థానంలో తెలంగాణ

ఇన్నోవేషన్ ఇండెక్స్ లో తెలంగాణ సత్తా చాటింది. పెద్ద రాష్ట్రాల జాబితాలో రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. 2022 ఏడాదికి సంబంధించి నీతి ఆయోగ్ ఈ నివేదికను విడుదల చేసింది. గత ఏడాది ఫోర్త్ ప్లేస్ లో ఉన్న మన రాష్ట్రం ఈ సారి రెండో స్థానానికి ఎగబాకింది.

నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం… ఎం.ఎన్.సిలు, స్టార్టప్ కంపెనీలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా మారింది. గతంలో 4900గా ఉన్న స్టార్టప్ ల సంఖ్య ఇప్పుడు 9000కు చేరింది. ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణ నిలుస్తోంది. ఇక, ఐ.సి.టి ల్యాబ్స్ తో కూడిన స్కూళ్ల సంఖ్య 17 నుంచి 35 శాతానికి పెరిగింది. పెద్ద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల పనితీరును వేర్వేరుగా లెక్కించి … నీతి ఆయోగ్ ఈ నివేదికను తయారు చేసింది. అటు, పర్ఫార్మర్స్, ఎనేబులర్స్ విభాగాల్లోనూ తెలంగాణ మంచి ఫలితాలు సాధించింది. పర్ఫార్మర్స్ లో తొలి స్థానం, ఎనేబులర్స్ లో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఇన్నోవేషన్ ఇండెక్స్ లో పెద్ద రాష్ట్రాల జాబితాలో … కర్ణాటక మొదటి స్థానాన్ని ఆక్రమించింది. హర్యానా 3, మహారాష్ట్ర 4, తమిళనాడు 5వ ర్యాంకును దక్కించుకున్నాయి. గత ఏడాది 7వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ సారి 9వ ప్లేస్ కు పడిపోయింది.

Poultary

ఇన్నోవేషన్ ఇండెక్స్ లో మన రాష్ట్రం ఉత్తమ స్థానంలో నిలవడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఇన్నోవేషన్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఇన్ క్లూజివ్ గ్రోత్ అనే 3 – ఐ మంత్రా … ఇందుకు దోహదపడిందని చెప్పారు. భవిష్యత్ లో కూడా ఇలాంటి అద్భుత ఫలితాలను రాష్ట్రం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

ALSO READ: ఈ నెల 25న ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here