Telangana Mega DSC 2024 Notification

తెలంగాణ‌లో డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇటీవల విడుద‌లైంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 11 వేల 62 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందుకు సంబంధించిన అప్లికేష‌న్ల‌ను మార్చి 4 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వ‌ర‌కు ఆన్ లైన్ లో స్వీక‌రిస్తారు. ఈ నేప‌థ్యంలో అస‌లు ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలున్నాయి? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి? అప్లికేష‌న్ ఫీజు ఎంత చెల్లించాలి? ఇత‌ర నిబంధ‌న‌లేమిటి? ఈ పూర్తి వివ‌రాలు మీ కోసం. చ‌ద‌వండి.

TS Mega DSC Notification 2024
  • ద‌ర‌ఖాస్తు ఫీజు ఎంతంటే?:

గ‌తేడాది డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌లైన‌ప్పుడు దాదాపు ల‌క్షా 77 వేల మంది అప్లై చేసుకున్నారు. 5 వేల 89 పోస్టుల భ‌ర్తీకి దాన్ని రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే క‌దా. కానీ విద్యా శాఖ ఆ ప్ర‌క‌ట‌న‌ను ర‌ద్దు చేసింది. కొత్త పోస్టుల‌ను క‌లిపి తాజా నోటిఫికేష‌న్ ఇచ్చింది. అందులో 2,629 స్కూల్‌ అసిస్టెంట్ ఖాళీలున్నాయి. వాటితో పాటు 6,508 సెకండరీ గ్రేడ్‌, 727 భాషా పండితులు, 182 పీఈటీ పోస్టులు భర్తీ చేయ‌నున్నారు. అలాగే స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్ కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 సెకండరీ గ్రేడ్‌ టీచర్ పోస్టులకూ ప‌రీక్ష జ‌రుగ‌నుంది.

2023లో అప్లై చేసుకున్న అభ్య‌ర్థులు మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. పాత అప్లికేష‌న్ల‌నే ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. కొత్త‌గా ద‌ర‌ఖాస్తు చేసుకునేవాళ్లు ఒక్కో పోస్టుకు రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుంది. https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.

Poultary
  • వ‌యోప‌రిమితి ఎలా ఉందంటే?:

అభ్య‌ర్థుల క‌నిష్ట వ‌యోప‌రిమితి 2023 జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి. గ‌రిష్ట వ‌య‌సు 46 ఏళ్లుగా నిర్ణ‌యించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు ఐదేళ్లు, దివ్యాంగుల‌కు ప‌దేళ్లు, మాజీ సైనికుల‌కు మూడేళ్ల స‌డ‌లింపు ఉంటుంది. బీఎడ్‌, డీఎడ్‌ చివరి సంవత్సరం, చివరి సెమిస్టర్‌ పరీక్షలు రాసిన వాళ్లు కూడా అప్లై చేసుకునే వీలుంది. అభ్యర్థుల స్థానికతను నిర్ధారించేందుకు గతంలో 4-10 తరగతుల చదువును ప‌రిగ‌ణ‌లోకి తీసుకునేవాళ్లు. ఇప్పుడు 1 నుంచి 7 త‌ర‌గ‌తుల‌ను లెక్క‌లోకి తీసుకుంటారు.

  • 11 చోట్ల ఎగ్జామ్ సెంట‌ర్లు:

టీచ‌ర్ రిక్రూట్ మెంట్ ఎగ్జామ్ పూర్తిగా కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వ‌హిస్తారు. ప‌ది రోజుల పాటు ఈ ప‌రీక్ష జ‌రుగుతుంది. హైద‌రాబాద్, రంగారెడ్డి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, మెద‌క్, నిజామాబాద్, క‌రీంన‌గ‌ర్, ఆదిలాబాద్, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్, సంగారెడ్డి, న‌ల్ల‌గొండ జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. జిల్లాల వారీగా చూస్తే హైద‌రాబాద్ లో అత్య‌ధికంగా 878, పెద్ద‌ప‌ల్లిలో అత్య‌ల్పంగా 93 పోస్టులున్నాయి.

అభ్య‌ర్థుల‌కు ఎవైనా సందేహాలుంటే 91541 14982, 63099 98812 నంబర్లలో సంప్ర‌దించొచ్చు. అలాగే helpdesktgdsc24@gmail.com మెయిల్ ద్వారా కూడా సందేహాలు నివృత్తి చేసుకోవ‌చ్చు.

- పి. వంశీకృష్ణ‌
Bharati Cement