• భార‌తీయ మార్కెట్ లోకి లంక ఎస్.ఎస్.ఎల్ సుపీరియ‌ర్ జీఐ వైర్ ప్రొడ‌క్ట్స్
  • అందుబాటులోకి పౌల్ట్రీ 300, ప్రీమియం 100 హాట్ డిప్డ్ గాల్వనైజ్డ్ స్టీల్ వైర్స్
  • తొలి ఓవ‌ర్సీస్ ఆఫీస్ ను హైద‌రాబాద్ లో ప్రారంభించిన లంక ఎస్.ఎస్.ఎల్

హైద‌రాబాద్, ఏప్రిల్-2024:  జీఐ వైర్ ఇండ‌స్ట్రీ దిగ్గ‌జం, శ్రీలంక‌కు చెందిన ప్ర‌ముఖ కంపెనీ లంక స్పెష‌ల్ స్టీల్స్ లిమిటెడ్ – ఎల్.ఎస్.ఎస్.ఎల్.. భార‌తీయ మార్కెట్ లో రెండు ప్ర‌త్యేక‌మైన గాల్వనైజ్డ్ స్టీల్ వైర్ల‌ను లాంఛ్ చేసింది. లంక స్పెష‌ల్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పౌల్ట్రీ 300, లంక స్పెష‌ల్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రీమియం 100 పేర్ల‌తో వీటిని అందుబాటులోకి తెచ్చింది. పౌల్ట్రీ రంగంలో వినియోగించేందుకు ఈ హైక్వాలిటీ ఉత్ప‌త్తులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇండియ‌న్ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని ఎల్.ఎస్.ఎస్.ఎల్ ఈ ప్రొడ‌క్ట్స్ ను రూపొందించింది. హైద‌రాబాద్ లోని రాడిస‌న్ హైటెక్ సిటీ హోట‌ల్ లో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

వీటితోపాటుగా లంక ఎస్.ఎస్.ఎల్ త‌న తొలి ఓవ‌ర్సీస్ ఆఫీస్ ను హైద‌రాబాద్ లో ప్రారంభించింది. గ‌చ్చిబౌలిలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈబీ క్రిసీ గ్రూప్ ఛైర్మ‌న్ ఎస్.డి.ఆర్ అరుద్ ప్ర‌గాసం ఈ కార్యాల‌యాన్ని ప్రారంభించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌వీణ్ డిసిల్వా (డైరెక్ట‌ర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ – లంక స్పెష‌ల్ స్టీల్స్), న‌ట‌రాజ‌న్ (మేనేజింగ్ డైరెక్ట‌ర్ – సేలం వెల్డ్ మెష్), ఉద‌య్ సింగ్ బ‌యాస్ (ప్రెసిడెంట్ – ఇండియ‌న్ పౌల్ట్రీ ఎక్విప్ మెంట్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ అసోసియేష‌న్), చ‌క్ర‌ధ‌ర్ రావు (డైరెక్ట‌ర్ – ఇండియ‌న్ పౌల్ట్రీ ఎక్విప్ మెంట్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ అసోసియేష‌న్), గేయన్ పతినాయక (సేల్స్ & మార్కెటింగ్ హెడ్ – లంక స్పెష‌ల్ స్టీల్స్ లిమిటెడ్) త‌దిత‌రులు పాల్గొన్నారు.

Poultary

అనంత‌రం ఈబీ క్రిసీ గ్రూప్ ఛైర్మ‌న్ ఎస్.డి.ఆర్ అరుద్ ప్ర‌గాసం మాట్లాడుతూ ప్ర‌పంచ మార్కెట్ లో మ‌రింత‌గా విస్త‌రించ‌డం ఎంతో ముఖ్య‌మ‌ని చెప్పారు. “

లంక‌ స్పెష‌ల్ స్టీల్స్ లిమిటెడ్ అనేది ఒక‌ప్పుడు టాటా స్టీల్ కంపెనీలో ఒక భాగం. 2015లో దాన్ని ఈబీ క్రిసీ & కో. పి.ఎల్.సి కొనుగోలు చేసింది. ప్ర‌స్తుతం ఇది శ్రీలంకలోని టాటా స్టీల్ గ్లోబల్ వైర్ ఇండియాకు ఏకైక ఏజెంట్ గా, పంపిణీదారుగా కొన‌సాగుతోంది. లంక ఎస్.ఎస్.ఎల్ సంస్థ భార‌తీయ మార్కెట్ కు కొత్తేమీ కాదు. ఎన్నో ఏళ్లుగా ఈ మార్కెట్ తో అనుబంధాన్ని క‌లిగి ఉంది” అని వివ‌రించారు.

గ్లోబ‌ల్ మార్కెట్ లో అందులోనూ మొద‌ట‌గా భార‌త్ లో త‌మ బ్రాండ్ ను అధికారికంగా ప్రారంభించ‌డం ప‌ట్ల లంక స్పెష‌ల్ స్టీల్స్ డైరెక్ట‌ర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ సంతోష్ డిసిల్వా సంతోషం వ్య‌క్తం చేశారు. పౌల్ట్రీ, జ‌న‌ర‌ల్ ఫెన్సింగ్ మార్కెట్ లో 30 ఏళ్ల అనుభ‌వం ఉన్న సేలం వెల్డ్ మెష్ త‌మ కంపెనీకి అందిస్తున్న‌ స‌హ‌కారం ఎంతో గొప్ప‌ద‌ని కొనియాడారు.

లంక స్పెష‌ల్ స్టీల్స్ తో భాగ‌స్వామ్యం కావ‌డం ప‌ట్ల సేలం వెల్డ్ మెష్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ న‌ట‌రాజ‌న్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. వినియోగ‌దారుల‌కు నాణ్య‌మైన ఉత్ప‌త్తులు అందించేందుకు భ‌విష్య‌త్ లో కూడా క‌లిసి ప‌ని చేస్తామ‌ని తెలిపారు.

లంక స్పెష‌ల్ స్టీల్స్ గురించి:

గాల్వనైజ్డ్ ఐర‌న్ వైర్ విభాగంలో లంక స్పెష‌ల్ స్టీల్ లిమిటెడ్ తిరుగులేని రారాజుగా వెలుగొందుతోంది. 25 ఏళ్ల సుదీర్ఘ అనుభ‌వం ఈ కంపెనీ సొంతం. యూరోపియ‌న్, కెనెడియ‌న్ టెక్నాల‌జీతో కూడిన అత్యాధునిక ఉత్పాదక సదుపాయం ఇందులో ఉంది. నేష‌న‌ల్ క‌న్వెన్ష‌న్ ఆన్ క్వాలిటీ & ప్రొడ‌క్టివిటీ అవార్డ్స్ – 2023 లో భాగంగా నాలుగు స్వ‌ర్ణ పుర‌స్కారాలు, ఒక కాంస్య పుర‌స్కారాన్ని లంక స్పెష‌ల్ స్టీల్స్ సొంతం చేసుకుంది. వీటితో పాటు అనేక అవార్డులు, ప్ర‌శంస‌లు అందుకుంది. ఇక, లంక ఎస్.ఎస్.ఎల్ తయారు చేసిన గాల్వనైజ్డ్ స్టీల్ వైర్లు ఎంతో మన్నికైనవి. 25 ఏళ్ల పాటు ఇవి చెక్కు చెదరవు. శ్రీలంకలోని మొరటువా యూనివర్శిటీ పరిశోధనలో ఇది వెల్లడైంది.

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here