కోహ్లీ ఒక్క ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ విలువ రూ. 8.69 కోట్లు..!

విరాట్ కోహ్లీ ఒక్క ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ విలువ రూ. 8.69 కోట్లు..!

విరాట్ కోహ్లీ! క్రీడాభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఒంటి చేత్తో భారత జట్టుకు ఎన్నో అద్భుత విజయాలను కోహ్లీ అందించాడు. సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. తన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విరాట్ … కొద్దిరోజులుగా సరైన ఫామ్ లేక సతమతం అవుతున్నాడు. అయితేనేం సంపాదన విషయంలో మాత్రం ఔరా అనిపిస్తున్నాడు.

సోషల్ మీడియాలో కోహ్లీ చురుకుగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. తాజా అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటాడు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇన్ స్టాగ్రామ్. విరాట్ కు ఇన్ స్టాలో 209 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. దాని ద్వారా అతనికి వచ్చే ఆదాయం కూడా అదే రేంజ్ లో ఉంది. ఇన్ స్టాలో ఒక్కో స్పాన్సర్ పోస్ట్ కు కోహ్లీకి అక్షరాలా 8 కోట్లా 69 లక్షల రూపాయలు దక్కుతున్నాయి. ఆసియాలో మరే ఇతర క్రీడాకారుడు ఇంత పెద్ద మొత్తంలో ఆర్జించకపోవడం విశేషం.

2022 ఏడాదికి సంబంధించి Hopperhq.com ఈ నివేదికను విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం … ఇన్ స్టాగ్రామ్ ద్వారా అత్యధిక సంపాదన పొందుతున్న ఆటగాళ్ళ లిస్ట్ లో విరాట్ … ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్నాడు. Hopperhq.com జాబితాలో గత సంవత్సరం కంటే ఈ సారి మెరుగయిన ర్యాంకును సొంతం చేసుకున్నాడు.

Poultary

ఇక, పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఈ లిస్ట్ లో మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. ఇన్ స్టాలో ఒక్కో స్పాన్సర్ పోస్ట్ కు రొనాల్డోకు వచ్చే ఆదాయం రూ. 19.13 కోట్లు. ఆ తర్వాత ప్లేస్ ను అర్జెంటీనా ఫుట్‌ బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ దక్కించుకున్నాడు. అతడు ఒక్కో పోస్ట్ ద్వారా రూ. 14.13 కోట్లు సంపాదిస్తున్నాడు.

 

ALSO READ: రెండు రోజుల పాటు భారీ వర్షాలు

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here