హై బిజ్ టీవీ మీడియా అవార్డ్స్ 2023

హై బిజ్ టీవీ మీడియా అవార్డ్స్-2023కి దరఖాస్తుల ఆహ్వానం


  • మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన హై బిజ్ టీవీ యాజమాన్యం, పాత్రికేయ ప్రముఖులు
  • 2021, 22లో రెండు సార్లు విజయవంతంగా పురస్కారాలు అందజేసిన హై బిజ్ టీవీ ఈ సారి జరగబోయేది 3వ ఎడిషన్

హైదరాబాద్, 05 జనవరి 2023:

మీడియా రంగంలో మ‌రో అద్భుత ఘ‌ట్టానికి తెర లేవ‌నుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో … జర్నలిజం, అడ్వ‌ర్టైజ్ మెంట్, సర్క్యూలేషన్ త‌దిత‌ర‌ కేటగిరీల్లో విశేష సేవ‌ల‌ను అందిస్తున్న వారికి స‌ముచిత గౌర‌వం ద‌క్క‌నుంది. ఆయా రంగాల్లో రాణిస్తున్న‌ సిబ్బందిని ఘ‌నంగా స‌త్క‌రించాల‌ని హై బిజ్ టీవీ సంక‌ల్పించింది. దీనిలో భాగంగానే హై బిజ్ టీవీ మీడియా అవార్డ్స్-2023 (హెచ్.ఎం.ఎ – 2023) కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది.

హై బిజ్ టీవీ గ‌తంలో ప‌లు రంగాల్లో అవార్డుల‌ను అంద‌జేసింది. ఉమెన్స్ లీడ‌ర్ షిప్ అవార్డ్స్ (2020, 21, 22), హెల్త్ కేర్ అవార్డ్స్ (2021, 22), ఫుడ్ అవార్డ్స్ (2022) వంటి కార్య‌క్ర‌మాల‌ను దిగ్విజ‌యంగా చేప‌ట్టింది. అలాగే 2021, 2022లో హై బిజ్ టీవీ మీడియా అవార్డ్స్ ను అందజేసింది. అదే తరహాలో ఈ సంవత్సరం కూడా పురస్కారాలను ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం జరగబోయేది హెచ్.ఎం.ఎ మూడో ఎడిషన్ కావడం విశేషం. 2021, 22లో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మాలకు ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌రై పుర‌స్కారాల‌ను అంద‌జేశారు.

Poultary

థర్డ్ ఎడిషన్ లో భాగంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో.. ముఖ్యమైన కేటగిరిల్లో హై బిజ్ టీవీ అవార్డ్స్ ఇవ్వనుంది. ఆయా రంగాల్లో 2022-23లో అద్భుత ప్రతిభ కనబర్చిన వారిని సత్కరించనుంది. ఇందుకుగాను ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా సిబ్బంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలను మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ రాజశేఖర్ రెడ్డి (జనరల్ సెక్రటరీ – క్రెడాయ్, హైదరాబాద్), శ్రీ ఎం. రవీందర్ రెడ్డి (డైరెక్టర్ మార్కెటింగ్ – భారతి సిమెంట్), శ్రీ నరేంద్ర రామ్ నంబుల (సి.ఎం.డి – లైఫ్ స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్), శ్రీ సోమశేఖర్ (ఎక్స్ అసోసియేట్ ఎడిటర్ & చీఫ్ ఆఫ్ బ్యూరో – ది హెచ్.బి.ఎల్), శ్రీ వినోద్ (ఎక్స్ జీఎం సాక్షి & ఎక్స్ మేనేజర్ ఈనాడు), శ్రీ ఎం. రాజ్ గోపాల్ (ఎండీ – హై బిజ్ టీవీ & తెలుగు నౌ), డాక్టర్ జె. సంధ్యారాణి (సీఈఓ – హై బిజ్ టీవీ & తెలుగు నౌ) తదితరులు ఇందులో పాల్గొన్నారు.

ఆన్ లైన్ బిజినెస్ న్యూస్ ఛానెల్స్ లో హై బిజ్ టీవీ ఒక అద్భుతం. యూట్యూబ్ లో 6 లక్షల 50 వేల మందికి పైగా స‌బ్ స్రైబ‌ర్లు, ఎఫ్బీ లో 1.3 మిలియన్ ఫాలోవర్స్ దీని సొంతం. దేశంలోనే టాప్ డిజిట‌ల్ బిజినెస్ ఛాన‌ల్స్ లో… హై బిజ్ టీవీ ఒక‌టిగా దూసుకుపోతోంది. గ‌త 14 ఏళ్లుగా వీక్ష‌కుల‌కు దాదాపు ల‌క్ష కు పైగా బిజినెస్ వీడియోల‌ను అందిస్తూ వ‌స్తోంది. హై బిజ్ టీవీ అంటేనే బిజినెస్ వీడియో లైబ్ర‌రీ అనే న‌మ్మ‌కాన్ని సొంతం చేసుకుంది.

హై బిజ్ టీవీ మీడియా అవార్డ్స్-2023 కు సంబంధించిన నామినేష‌న్ల ప్ర‌క్రియ మొద‌లైంది. ఆయా రంగాల్లో ప‌ని చేస్తున్న వారు హెచ్.ఎం.ఎ పుర‌స్కారాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. హై బిజ్ టీవీకి అందిన ద‌ర‌ఖాస్తుల‌ను… అపార అనుభ‌వం క‌లిగిన జ్యూరీ స‌భ్యులు ప‌రిశీలించి విజేత‌ల‌ను ఎంపిక చేస్తారు. జ్యూరీ స‌భ్యుల‌దే తుది నిర్ణ‌యం. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ఈ ఎంపిక ప్ర‌క్రియ జ‌రుగుతుంది.

హై బిజ్ టీవీ మీడియా అవార్డ్స్-2023కి మ‌రిన్ని వివ‌రాల కోసం +91 966 679 6622 నంబ‌ర్ లో సంప్ర‌దించ‌గ‌ల‌రు.

– హై బిజ్ టీవీ ద్వారా జారీ చేయ‌డ‌మైన‌ది.

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here