సాధారణ వైరల్ జ్వరాలతోపాటు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికన్ గున్యా వంటి ప్రమాదకరమైన వ్యాధుల కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి, అమీరుపేటలో ప్రత్యేకంగా 24/7 ఫీవర్ క్లినిక్ మరియు డే కేర్ సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ కార్యక్రమాన్ని SR నగర్ డివిజన్ ఏసీపీ శ్రీ ఎస్.వి. రాఘవేంద్రరావు, ఇన్‌స్పెక్టర్ శ్రీ టి. శ్రీనాథ్ రెడ్డి కలిసి ప్రారంభించారు. వర్షాకాలంలో ఇటువంటి ప్రత్యేక క్లినిక్‌లు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఎంతో అవసరమని వారు తెలిపారు.
ఫీవర్ క్లినిక్‌లో ప్రత్యేకతలు
- రౌండ్-ది-క్లాక్ వైద్య సేవలు (24/7)
- NABL సర్టిఫైడ్ ల్యాబ్, ఆన్‌సైట్ బ్లడ్ బ్యాంక్
- డే కేర్ సర్వీసులు – 12 గంటలపాటు చికిత్స మరియు తక్షణ వైద్యం
- వైరల్ జ్వరాలు, డెంగ్యూ, టైఫాయిడ్, చికన్ గున్యా, మలేరియా, వాంతులు, విరేచనాలు, శ్వాస సంబంధిత సమస్యలు వంటి జబ్బులకు ప్రత్యేక చికిత్స
వైద్యుల సూచనలు

ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ క్లస్టర్ సీఈఓ డాక్టర్ హరికుమార్ రెడ్డి మాట్లాడుతూ:
“ఇంటికితప్పి చదువు, ఉద్యోగాల కోసం ఉన్న యువతకు ఇది విశేష ప్రయోజనాన్ని ఇస్తుంది. సరైన సమయంలో వైద్య పరీక్షలు, మందులు తీసుకుంటే జీవితాన్ని రక్షించవచ్చు.”
అలాగే ప్రజలు సొంతంగా మందులు వాడకూడదని, లాజిక్ లేకుండా తీసుకునే మందుల వలన ప్రమాదాలు పెరగవచ్చని ఆయన హెచ్చరించారు.
ప్రజలకు సూచనలు
- బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించండి
- నీళ్లు నిల్వ కాకుండా చూసుకోవాలి
- మోస్కిటో స్క్రీన్లు ఉపయోగించాలి
- తినే ముందు, తాగే ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి
- తీవ్రమైన జ్వరం, బలహీనత, వాంతులు, విరేచనలు ఉన్నచో వెంటనే ఫీవర్ క్లినిక్‌ను సంప్రదించండి













