హైదరాబాద్, గ్లోబల్ సిటీగా మారుతున్న సమయంలో మరో ముందడుగు వేసింది. జూబ్లీ హిల్స్‌లోని కేబీఆర్ పార్క్ గేట్-1 సమీపంలో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నిర్మిస్తున్న మల్టీ-లెవల్ స్మార్ట్ పార్కింగ్ నగర వాసుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ ఫెసిలిటీ 405 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉంది. ఇందులో 72 కార్ల పార్కింగ్ సామర్థ్యం ఉన్నా, 20% స్థలం టూ-వీలర్ల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. 6 యూనిట్ల రోటరీ మెకానికల్ పార్కింగ్ సిస్టమ్ ద్వారా ప్రతి యూనిట్ 12 కార్ల వరకు నిలుపుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది.
స్మార్ట్ ఫీచర్లు – స్మార్ట్ యూజింగ్!
ఈ పార్కింగ్ సిస్టమ్ పూర్తిగా ఆటోమేటెడ్ & స్మార్ట్ కార్డ్ ఆధారితంగా ఉంటుంది. టోకెన్లు, ఫిజికల్ టికెట్లు ఉండవు. మొబైల్ యాప్ ద్వారా:
- రియల్ టైమ్ పార్కింగ్ సమాచారం
- ముందస్తు బుకింగ్
- ఆన్‌లైన్ చెల్లింపులు
- QR కోడ్ స్కాన్ చేసి చెల్లించే సదుపాయం లభ్యం.
భద్రత & అదనపు సౌకర్యాలు
పార్కింగ్ లోపల, బయట CCTV నిఘా ఏర్పాటు చేయడం ద్వారా భద్రతకు పెద్దపీట వేశారు. అదనంగా:
- EV ఛార్జింగ్ పాయింట్లు
- కాఫీ కియోస్క్‌లు
- మినీ-మార్ట్‌లు వంటి వాణిజ్య అవసరాల్ని కూడా తీర్చేలా 20% స్థలాన్ని కేటాయించారు.
హైదరాబాద్‌కు ఇదొక తొలి మెక్కానైజ్డ్ పార్కింగ్
ఇది నగరంలో మొట్టమొదటి రోటరీ మెకానైజ్డ్ మల్టీ-లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో, 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు.
ఇది కేవలం కేబీఆర్ పార్క్‌కు వచ్చే వాళ్లకే కాదు… జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల వాసులకు కూడా రవాణా, ట్రాఫిక్ సమస్యల్లో ఉపశమనం కలిగించనుంది.