నేటి నుంచి 5జీ స్పెక్ట్రమ్ వేలం

నేటి నుంచి 5జీ స్పెక్ట్రమ్ వేలం

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5జీ స్పెక్ట్రమ్ వేలం ఇవాళ ప్రారంభమైంది. టెలికాం దిగ్గజ కంపెనీలు భారతి ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా ఇందులో పాల్గొంటున్నాయి. వాటితో పాటుగా అదానీ గ్రూప్ నకు చెందిన అదానీ డేటా నెట్ వర్క్స్ కూడా పోటీ పడనుంది. క్యాప్టివ్ నెట్ వర్క్ (సొంత అవసరాల) కోసం కూడా స్పెక్ట్రమ్ ను వినియోగించుకునే వీలును కేంద్ర ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. నాన్ టెలికాం కంపెనీలకు కూడా బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో, ఈ సారి పోటీ తీవ్రంగా ఉండనుంది.

నేటి నుంచి మొదలయ్యే వేలంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు కంపెనీలు బిడ్లను దాఖలు చేయవచ్చు. ఈ ప్రక్రియ రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. 9 బ్యాండ్లలో కలిపి 72 గిగా హెడ్జ్ స్పెక్ట్రమ్ వేలానికి సిద్ధంగా ఉంది. దీని విలువ దాదాపు రూ. 4.3 లక్షల కోట్లు. ఆక్షన్ లో దక్కించుకున్న స్పెక్ట్రమ్ ను ఆ కంపెనీలు 20 ఏళ్లపాటు ఉపయోగించుకోవచ్చు. ఈ వేలంలో 1 నుంచి 1.1 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్ ను ఆయా సంస్థలు కొనుగోలు చేస్తాయని అంచనా వేస్తున్నారు.

తక్కువ శ్రేణి ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల పరిధిలో 600, 700, 800, 900 మెగా హెడ్జ్ ఉన్నాయి. 1800, 2100, 2300 మెగా హెడ్జ్ ఫ్రీక్వెన్సీ కలిగినవి మధ్య శ్రేణి పరిధిలోకి వస్తాయి. 24 నుంచి 40 గిగా హెడ్జ్ బ్యాండ్లను అధిక ఫ్రీక్వెన్సీగా పరిగణిస్తారు. వీటిలో రిలయన్స్ జియో 800 మెగా హెడ్జ్ బ్యాండ్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. ఇక, 900 మెగా హెడ్జ్ ను ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా భారీగా కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. 1800 మెగా హెడ్జ్ కోసం అన్ని సంస్థలూ పోటీ పడనున్నాయి.

Poultary

కాగా, మన దేశంలో ఫస్ట్ ఫేజ్ కింద 13 నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తేనున్నారు. ముంబై, బెంగళూరు, ఢిల్లీ, గుర్ గావ్, కోల్ కతా, లక్నో, పుణె, చెన్నై లో ఈ సదుపాయాన్ని కల్పిస్తారు. వాటితో పాటుగా హైదరాబాద్, గాంధీనగర్, జామ్ నగర్, అహ్మదాబాద్, చండీగఢ్ లో 5జీ సేవలను వినియోగించుకోవచ్చు.

 

ALSO READ: వయసు 15 ఏళ్లు … జీతం రూ. 33 లక్షలు..!

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here