Chennai Super Kings Vs Royal Challengers Bengaluru

కోట్లాది మంది క్రికెట్ ల‌వ‌ర్స్ ఎంత‌గానో ఎదురుచూస్తున్న Indian Premier League సీజ‌న్ 17 మ‌రికొద్ది గంట‌ల్లో మొద‌ల‌వ‌బోతోంది. మార్చి 22 నుంచి మే 26 వ‌రకు ఈ టోర్నీ అల‌రించ‌నుంది. టైటిల్ కోసం ఈ సారి ప‌ది జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. లోక్ స‌భ ఎన్నిక‌ల దృష్ట్యా IPL-17ను ద‌శ‌ల వారీగా నిర్వ‌హిస్తున్నారు. గ‌త సీజ‌న్ ఛాంపియ‌న్ Chennai Super Kings తో Royal Challengers Bangalore తొలి మ్యాచ్ ఆడుతుంది. మ‌రి ఈ సారి టోర్నీ ఎలా ఉండ‌బోతుంది? కోట్లు కుమ్మ‌రించి కొనుగోలు చేసిన ప్లేయ‌ర్స్ మెరుపులు మెరిపిస్తారా? టైటిల్ ను ఏ జ‌ట్టు ఎగ‌రేసుకుపోతుంది? వేచి చూద్దాం.

Indian Premier League సీజ‌న్ 17కు అంతా రెడీ అయింది. చెన్నై వేదిక‌గా శుక్ర‌వారం తొలి మ్యాచ్ జ‌రుగ‌నుంది. రాత్రి ఎనిమిదింటికి మొద‌ల‌య్యే మ్యాచ్ లో Chennai Super Kings, Royal Challengers Bangalore ఢీకొట్ట‌బోతున్నాయి. దానిక‌న్నా ముందు opening ceremony గ్రాండ్ గా నిర్వ‌హించేందుకు ప్లాన్ చేశారు. AR Rahman, Sonu Nigamతో పాటు బాలీవుడ్ స్టార్స్ Akshay Kumar, Tiger Shroff ఇందులో perform చేసే ఛాన్స్ ఉంది. opening ceremonyని Star Sportsలో, మ్యాచ్ ల లైవ్ స్ట్రీమింగ్ JioCinemaలో చూడొచ్చు.

ప‌ది జ‌ట్లు .. రెండు గ్రూపులు:

Poultary

Chennai Super Kings, Royal Challengers Bangaloreతో పాటు Punjab Kings, Delhi Capitals, Kolkata Knight Riders, Sunrisers Hyderabad ఐపీఎల్ లో త‌ల‌ప‌డుతున్నాయి. వాటితో పాటు Rajasthan Royals, Lucknow Super Giants, Mumbai Indians, Gujarat Titans త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నాయి. ఈ ప‌ది జ‌ట్ల‌ను రెండు గ్రూపులుగా విభ‌జించారు. ఒక్కో జ‌ట్టు 14 మ్యాచ్ లు ఆడుతుంది. ఆ త‌ర్వాత పాయింట్స్ టేబుల్ లో టాప్ 4 టీమ్స్ playoffకు చేర‌తాయి. నెక్ట్స్.. Qualifier 1, Eliminator, Qualifier 2 ఉంటుంది. Qualifier 1లో విజేత‌గా నిలిచిన టీం.. డైరెక్ట్ గా ఫైనల్ కు వెళ్తుంది. అందులో ఓడిన జ‌ట్టుకు ఇంకో ఛాన్స్ ఉంటుంది. ఆ టీం.. Eliminator matchలో గెలిచిన వారితో ఆడొచ్చు. ఆ మ్యాచ్ లో విన్ అయిన జ‌ట్టు ఫైన‌ల్ కు చేరుకుంటుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన 16 సీజ‌న్స్ లో Mumbai Indians ఐదు సార్లు, Chennai Super Kings ఐదు సార్లు టైటిల్ ద‌క్కించుకున్నాయి. రెండు సార్లు Sunrisers, మ‌రో రెండు సార్లు Kolkata Knight Riders విజేత‌గా నిలిచాయి. ఇక 2008లో Rajasthan Royalsకు.. 2022లో Gujarat Titans ఐపీఎల్ టైటిల్ ద‌క్కింది. మ‌రి ఈ ఏడాది మ‌ళ్లీ వీటిలో ఏదో ఒక జ‌ట్లు క‌ప్ ను ఎగ‌రేసుకుపోతుందా? లేదా వేరే జ‌ట్టును విజ‌యం వ‌రిస్తుందా? తేలాలంటే మే 26 వ‌ర‌కు ఆగాల్సిందే.

- పి. వంశీకృష్ణ‌
Bharati Cement