Hybiz Tv Telangana Tea Championship 2024

హై బిజ్ టీవీ తెలంగాణ టీ ఛాంపియ‌న్ షిప్ న‌కు అద్భుత స్పంద‌న‌

విభిన్న కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌లో ముందుండే హై బిజ్ టీవీ అలాంటి మ‌రో ఈవెంట్ ను విజ‌య‌వంతంగా చేప‌ట్టింది. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని తెలంగాణ టీ ఛాంపియ‌న్ షిప్ – 2024ను గ్రాండ్ గా నిర్వ‌హించింది. హైద‌రాబాద్ లోని హెచ్ ఐసీసీ నోవాటెల్ వేదిక‌గా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో దాదాపు 150 మంది మ‌హిళ‌లు పాల్గొన్నారు. రుచిక‌ర‌మైన ఛాయ్ పెట్టేందుకు ఒక‌రితో ఒక‌రు పోటీ ప‌డ్డారు.

హై బిజ్ టీవీ తెలంగాణ టీ ఛాంపియ‌న్ షిప్ – 2024కు సుమ‌యా రెడ్డి (న‌టి & నిర్మాత‌), పి. బ్ర‌హ్మ‌య్య (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ – శ్రీ చ‌క్ర మిల్క్), జి. రాంరెడ్డి (నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ – క్రెడాయ్) అతిథులుగా హాజ‌రయ్యారు. ఎం. రాజ్ గోపాల్ ( మేనేజింగ్ డైరెక్ట‌ర్ – హై బిజ్ టీవీ & తెలుగు నౌ)

హై బిజ్ టీవీ తెలంగాణ టీ ఛాంపియ‌న్ షిప్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. పోటీలో పాల్గొన్న మ‌హిళ‌లు పెట్టిన ఛాయ్ ని జ్యూరీ స‌భ్యులు టేస్ట్ చేసి.. పాయింట్లు కేటాయించారు. అందులో అత్య‌ధిక పాయింట్స్ సాధించిన 12 మందిని ఫైన‌ల్ రౌండ్ కు ఎంపిక చేశారు. ఆ రౌండ్ లో రుచిక‌ర‌మైన ఛాయ్ చేసిన ఎనిమిది మందిని తుది విజేత‌లుగా నిర్ణ‌యించారు. మొద‌టి బ‌హుమ‌తి ల‌క్ష రూపాయ‌లు, సెకండ్ ప్రైజ్ రూ. 50 వేలు, మూడో బ‌హుమ‌తి రూ. 25 వేలు అంద‌జేశారు. త‌రువాతి 5 స్థానాల్లో నిలిచిన వారికి త‌లో రూ. 10 వేలు ద‌క్కాయి.

Poultary

విజేత‌ల వివ‌రాలు:

కె. జ్యోత్స్న – మొద‌టి బ‌హుమ‌తి ల‌క్ష రూపాయ‌లు

కె. వ‌ర‌ల‌క్ష్మి – రెండో బ‌హుమ‌తి రూ. 50 వేలు

పి. జ్యోత్స్న – మూడో బ‌హుమ‌తి రూ. 25 వేలు

రూ. 10 వేల చొప్పున‌ గెలుచుకున్న ఐదుగురు విజేత‌లు:

1) ప్రియాంకా పాండే
2) షైలీ మానియ‌ర్
3) ఎం. గీత‌
4) రూపా బాల్
5) ఎన్. రాణి

కేంద్ర పర్యాట‌క మంత్రిత్వ శాఖ, ఇన్ క్రిడిబుల్ ఇండియా, తెలంగాణ టూరిజం స‌హ‌కారంతో హై బిజ్ టీవీ తెలంగాణ టీ ఛాంపియ‌న్ షిప్ ను నిర్వ‌హించింది. రెడ్ లేబుల్ టీ (టీ పార్ట్ న‌ర్), ఇండియ‌న్ ఆయిల్ (కుకింగ్ గ్యాస్ పార్ట్ న‌ర్), సుభాన్ బేక‌రీ(బేకింగ్ పార్ట్ న‌ర్), తెనాలి డ‌బుల్ హార్స్ (ప‌ల్సెస్ & దాల్స్ పార్ట్ న‌ర్) శ్రీ చ‌క్ర (మిల్క్ పార్ట్ న‌ర్), మ‌ధుర్ షుగ‌ర్స్ (స్వీట్ నెస్ పార్ట్ న‌ర్), వెన్యూ పార్ట్ నర్ (హెచ్ఐసిసి నోవాటెల్), హాస్పిటాలిటీ పార్ట్ న‌ర్ గా రూట్స్ వ్య‌వ‌హ‌రించాయి.

- పి. వంశీకృష్ణ
Bharati Cement