Women's Leadership Awards 2024

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా అంద‌జేత‌

వివిధ రంగాల్లో విశేషంగా రాణిస్తున్న అతివ‌ల‌కు హై బిజ్ టీవీ ప‌ట్టం క‌ట్టింది. అంతర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా పుర‌స్కారాల‌తో ఘ‌నంగా స‌త్క‌రించింది. హైద‌రాబాద్ లోని హెచ్ఐసీసీ నోవాటెల్ వేదిక‌గా హై బిజ్ టీవీ ఉమెన్స్ లీడ‌ర్ షిప్ అవార్డ్స్ పేరిట జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మం ఆద్యంతం ఆక‌ట్టుకుంది.

సైయెంట్ గ్రూప్ ఫౌండ‌ర్ ఛైర్మ‌న్ బీవీఆర్ మోహ‌న్ రెడ్డి దీనికి ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు. ల‌య‌న్ డాక్ట‌ర్ వై కిర‌ణ్ (హాన‌ర‌రీ కాన్సుల్ ఆఫ్ బ‌ల్గేరియా, సుచిరిండియా సీఈవో & మేనేజింగ్ డైరెక్ట‌ర్) స్పెష‌ల్ చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. కరుణ గోపాల్ (ఫ్యూచ‌రిస్టిక్ సిటీస్ ప్రెసిడెంట్, బీజేపీ నేత‌), డాక్ట‌ర్ ప్రీతి రెడ్డి (మేనేజింగ్ డైరెక్ట‌ర్ – మ‌ల్లారెడ్డి హెల్త్ సిటీ), డాక్టర్ విజయలక్ష్మి (ఫౌండర్ – మిర్రర్స్ లగ్జరి సెలూన్స్), ఎం. రాజ్ గోపాల్ (మేనేజింగ్ డైరెక్ట‌ర్ – హై బిజ్ టీవీ & తెలుగు నౌ) త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

50కి పైగా అవార్డులు:

మొత్తం 17 కేట‌గిరీల్లో పుర‌స్కారాల‌ను ప్ర‌దానం చేశారు. అగ్రిక‌ల్చ‌ర్, ఆర్ట్స్ & క్రాఫ్ట్స్, సీఎస్ఆర్, ఎడ్యుకేష‌న్, హాస్పిటాలిటీ, హ్యూమ‌న్ రిసోర్సెస్, మాన్యుఫాక్చ‌రింగ్, మీడియా విభాగాలు అందులో ఉన్నాయి. వీటితో పాటుగా ఫ్యాష‌న్, ఫైనాన్స్, గ‌ర‌వ్న‌మెంట్ స‌ర్వీసెస్, హెల్త్ కేర్, రియ‌ల్ ఎస్టేట్, రిటైల్, స్పోర్ట్స్, స్టార్ట‌ప్, యూత్ ఐకాన్ కేట‌గిరీల్లో అవార్డులు అందించారు. అలాగే యంగ్ ఆంట్రాప్రెన్యూర్ పుర‌స్కారం కూడా ప్ర‌దానం చేశారు. ఆయా రంగాల్లో విశేష కృషి చేస్తున్న 50 మందికిపైగా మ‌హిళ‌లు హై బిజ్ టీవీ ఉమెన్స్ లీడ‌ర్ షిప్ అవార్స్ ను సొంతం చేసుకున్నారు. హై బిజ్ టీవీ వ‌రుస‌గా ఐదోసారి ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం విశేషం.

Poultary

హై బిజ్ టీవీకి అభినందనల వెల్లువ:

మార్పు అనేది ఎన్నో కొత్త అవకాశాలను కల్పిస్తుందని బీవీఆర్ మోహన్ రెడ్డి తెలిపారు. కుటుంబం నుంచి మొదలుకుని దేశాన్ని నడిపే వరకు.. ప్రతి దాంట్లో మహిళల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉంటుందని చెప్పారు. అలాంటి స్త్రీలకు హై బిజ్ టివి ఉమెన్స్ లీడర్ షిప్ అవార్డ్స్ ఎంతో మోటివేషన్ ఇస్తాయని కొనియాడారు. చాలా పనులు పురుషులకన్నా మహిళలే బాగా చేస్తారని తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత మంది మహిళలు పారిశ్రామిక రంగంలోకి అడుగు పెట్టాలని సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

అతివల సహకారం లేకుంటే అసలు ఏది సాధించడం వీలు కాదని డాక్టర్ లయన్ కిరణ్ చెప్పారు. అలాంటి వారికి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తూ.. ఇలాంటి పురస్కారాలు అందజేసిన హై బిజ్ టీవీని అభినందించారు.
ప్రతి సమస్యను పరిష్కరించుకునే సామర్థ్యం మహిళలకు ఉంటుందని విజయలక్ష్మి తెలిపారు. వర్క్ లైఫ్, డొమెస్టిక్ కెరీర్ చక్కగా బ్యాలెన్స్ చేసే సత్తా కూడా ఉంటుందని చెప్పారు.

ఇదొక గొప్ప కార్యక్రమం:

హై బిజ్ టీవీని ఉమెన్స్ లీడ‌ర్ షిప్ అవార్డ్స్ గొప్ప కార్య‌క్ర‌మ‌మ‌ని విజేత‌లు కొనియాడారు. ఈ పుర‌స్కారాలు త‌మ‌కెంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయ‌ని చెప్పారు. మ‌హిళ‌ల ప్ర‌తిభ‌ను ప్ర‌పంచానికి చాటి చెపుతున్న హై బిజ్ టీవీని అభినందించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి మ‌రెన్నో కార్య‌క్ర‌మాలు చేయాల‌ని సూచించారు.

హై బిజ్ టీవీ ఉమెన్స్ లీడ‌ర్ షిప్ అవార్డ్స్ – 2024 ప‌వ‌ర్డ్ బై ఫ్రీడం కార్య‌క్ర‌మానికి తెలంగాణ ప్ర‌భుత్వం, స్త్రీ నిధి స‌హ‌కారాన్ని అందించాయి. తెనాలి డ‌బుల్ హార్స్ (ప‌ల్సెస్ & దాల్స్ పార్ట్ న‌ర్), ఎల్ఐసీ (ఇన్సూరెన్స్ పార్ట్ న‌ర్), సుభాన్ బేక‌రీ (బేకింగ్ పార్ట్ న‌ర్), పీఎన్ బీ (బ్యాంకింగ్ పార్ట్ న‌ర్), విజ‌యా డ‌యాగ్న‌స్టిక్ సెంట‌ర్ డయాగ్న‌స్టిక్ పార్ట్ న‌ర్ గా వ్య‌వ‌హ‌రించాయి.

- పి. వంశీకృష్ణ
Bharati Cement