భార‌త్ లో తొలి Bullet Train.. అందుబాటులోకి ఎప్పుడంటే?

చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న Bullet Train ప్రాజెక్ట్ పై కేంద్ర రైల్వే మంత్రి అశ్వ‌నీ వైష్ణ‌వ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 2026 నాటికి ఈ రైలు ప‌ట్టాల‌పై దూసుకుపోతుంద‌ని చెప్పారు. ఢిల్లీలో జ‌రిగిన Rising Bharat Summit 2024లో పాల్గొన్న ఆయ‌న ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల వివరాలు వెల్ల‌డించారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు, మేడిన్ ఇండియా చిప్ త‌దిత‌ర అంశాల‌ను ప్ర‌స్తావించారు.

ఫ‌స్ట్ ట్రైన్ ఏ రూట్ లో తిరుగుతుంది..?

గుజ‌రాత్ లోని సూర‌త్ నుంచి బిలిమోరా వ‌ర‌కు తొలి బుల్లెట్ ట్రైన్ న‌డ‌ప‌నున్నారు. 2028 నాటికి ముంబై-అహ్మ‌దాబాద్ రూట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తారు. ఇది కేవ‌లం ర‌వాణా మార్గం మాత్ర‌మే కాద‌ని.. ఆ రెండు న‌గ‌రాల మ‌ధ్య ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు వార‌ధి అని అశ్వ‌నీ వైష్ణ‌వ్ అన్నారు. ముంబైతో పాటు థానే, వాపి, సూర‌త్, వ‌డోద‌ర‌, అహ్మ‌దాబాద్ కు ఇదెంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చెప్పారు.

500 కిలోమీట‌ర్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మించేందుకు మిగ‌తా దేశాల‌కు 20 ఏళ్లు ప‌ట్టింద‌ని అశ్వ‌నీ వైష్ణ‌వ్ వెల్ల‌డించారు. మ‌న దేశంలో మాత్రం 8 నుంచి 10 ఏళ్ల‌లో దాన్ని పూర్తి చేస్తున్నామ‌ని చెప్పారు. గుజ‌రాత్, దాద్రా న‌గ‌ర్ హ‌వేలీ మీదుగా మ‌హారాష్ట్ర వ‌ర‌కు బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఉంటుంది. ఇందుకోసం 1400 హెక్టార్ల ల్యాండ్ అవ‌స‌ర‌మైంది. కారిడార్ మొత్తం పొడ‌వు దాదాపు 510 కిలోమీట‌ర్లు. ఇది పూర్తిగా అందుబాటులోకి వ‌స్తే అహ్మ‌దాబాద్ నుంచి ముంబైకి కేవ‌లం మూడు గంట‌ల్లో చేరుకోవ‌చ్చు.

Poultary

డిసెంబ‌ర్ నాటికి మేడిన్ ఇండియా చిప్‌:

2024 డిసెంబ‌ర్ నాటికి తొలి మేడిన్ ఇండియా చిప్ ను అందుబాటులోకి తీసుకొస్తామ‌ని అశ్వ‌నీ వైష్ణ‌వ్ తెలిపారు. మైక్రాన్ ప్లాంట్ లో ఇది త‌యార‌వుతోంద‌న్నారు. మ‌న దేశం ఎల‌క్ట్రానిక్స్ హ‌బ్ గా మారుతోంద‌ని చెప్పారు. బిలియ‌న్ డాల‌ర్ల విలువ‌గ‌ల టెలిక‌మ్యూనికేష‌న్ ఎక్విప్ మెంట్ భార‌త్ నుంచి ఎగుమ‌తి అయింద‌ని అశ్వ‌నీ వైష్ణ‌వ్ వెల్ల‌డించారు.

- పి. వంశీకృష్ణ‌
Bharati Cement