నిండు కుండలా మారిన జంట జలాశయాలు

నిండు కుండలా మారిన జలాశయాలు:

హైదరాబాద్ పరిధిలోని జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండు కుండలా మారాయి. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అవి జలకళను సంతరించుకున్నాయి. ఇన్ ఫ్లో అధికంగా ఉండటంతో ఆ రిజర్వాయర్ల గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ లో 13 గేట్లను 6 అడుగులు … హిమాయత్ సాగర్ లో 8 గేట్లను 4 అడుగుల మేర పైకి ఎత్తి జలాలను కిందకి వదులుతున్నారు.

ఉస్మాన్ సాగర్ జలాశయం పూర్తి నీటి మట్టం 1790 అడుగులు. కాగా, ప్రస్తుతం 1789.10 అడుగుల మేర నీళ్ళు నిల్వ ఉన్నాయి. 8 వేల క్యూసెక్కుల వరద ఇందులోకి వచ్చి చేరుతోంది. ఇక, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ లో 1763.50 అడుగుల మేర జలాలను నిల్వ చేసే వీలుంది. ఇప్పుడు ఇందులో 1762.55 అడుగుల మేర నీరు చేరింది. ఇన్ ఫ్లో 9 వేల క్యూసెక్కులుగా ఉంది.

రెండు రిజర్వాయర్ల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండటంతో ఆ సుందర దృశ్యాలను చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో ఉల్లాసంగా గడుపుతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా సందడి చేస్తున్నారు.

Poultary

మరోవైపు, జంట జలాశయాలతో పాటు గండిపేట గేట్లు ఎత్తివేయడంతో ఆ నీరు మూసీ నదిలో కలుస్తోంది. దీంతో వరద ఉధృతి పెరిగి మూసారాంబాగ్‌ వంతెన పై నుంచి నీరు ప్రవహిస్తోంది. ఈ పరిస్థితుల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. మూసారాంబాగ్ బ్రిడ్జిని మూసివేశారు. వంతెనకు రెండు వైపుల బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో అంబర్‌ పేట-మలక్‌ పేట మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

 

ALSO READ: బస్ ట్రాకింగ్ యాప్ ను ప్రారంభించిన TSRTC

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here