బస్ ట్రాకింగ్ యాప్ ను ప్రారంభించిన TSRTC

బస్ ట్రాకింగ్ యాప్:

ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంలో ఎల్లప్పుడూ ముందుండే TSRTC మరో అద్భుతమైన సేవతో ముందుకొచ్చింది. ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకుగానూ బస్ ట్రాకింగ్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. TSRTC ఎండీ వి.సి సజ్జనార్ దీన్ని ఆవిష్కరించారు. ప్యాసింజర్లు ఎక్కాల్సిన బస్సు ప్రస్తుతం ఎక్కడుంది..? ఎంత సమయలో అది వారి దగ్గరికి చేరుకుంటుంది..? తదితర వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీని డౌన్ లోడ్ చేసుకుని బస్సుల ప్రయాణ వివరాలను ట్రాక్ చేయొచ్చు.

అంతే కాకుండా..:
* ప్యాసింజర్లు తమ గమ్యస్థానానికి ఏ సమయానికి చేరుతారో తెలుసుకోవచ్చు.

* బస్ అరైవల్ టైంను కచ్చితంగా గుర్తించవచ్చు.

Poultary

* ప్రస్తుత లొకేషన్, సమీపంలో ఉన్న బస్ స్టాప్ వివరాలను తెలుసుకోవచ్చు.

* శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళే పుష్పక్ బస్సులు, ఇతర ప్రాంతాలకు తిరిగే గరుడ ప్లస్, రాజధాని, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ ప్రెస్ బస్సుల వివరాలను యాప్ ద్వారా సెర్చ్ చేయవచ్చు.

తెలంగాణలోని 96 డిపోల పరిధిలో 4 వేలకు పైగా బస్సులను ఈ యాప్ తో అనుసంధానం చేయనున్నట్టు ఆర్టీసి అధికారులు తెలిపారు. ఫస్ట్ ఫేజ్ లో పైలట్ ప్రాజెక్టు కింద 140 బస్సులను యాప్ పరిధిలోకి తీసుకొచ్చారు. వాటిలో మియాపూర్ – 2, కంటోన్మెంట్ డిపోలకు చెందిన 40 పుష్ బ్యాక్ బస్సులు ఉన్నాయి. ఆ డిపోల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఇవి నడుస్తున్నాయి.

ఇవే కాకుండా మియాపూర్ – 1, పికెట్ డిపోలకు చెందిన మరో 100 బస్సులను కూడా ట్రాకింగ్ యాప్ తో అనుసంధానం చేశారు. అవి సుదూర ప్రాంతాలకు సేవలను అందించే బస్సులు. ఆ డిపోల నుంచి శ్రీశైలం, విజయవాడ, ఏలూరు, భద్రాచలం, బెంగళూరు, విశాఖపట్నం రూట్లలో ఇవి నడుస్తున్నాయి.

త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 4 వేలకు పైగా బస్సులను ఈ యాప్ తో లింక్ చేస్తామని ఆర్టీసి అధికారులు తెలిపారు. TSRTC బస్ ట్రాకింగ్ యాప్ ను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ALSO READ: రూ. 245 కోట్లకు ఇంటిని అమ్మిన జూకర్ బర్గ్

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here