ఫిబ్రవరి 3, ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు

ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు

ఫిబ్రవరి 3, 2023 నుండి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ అధికారులతో ఈరోజు శాసనసభలో ఏర్పాట్లపై ముందస్తు సమావేశం నిర్వహించిన శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు.

సమావేశంలో స్పీకర్ పోచారం గారు మాట్లాడుతూ…

  • ఈనెల 3వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి.
  • గత సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించిన అధికారులు, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు.
  • తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల పనితీరు దేశంలోనే ఆదర్శంగా ఉన్నది.
  • తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలి.
  • అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరగడానికి గత సమావేశాలలో లాగానే ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలి.గౌరవ సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలి.
  • గత సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలకు పెండింగులో ఉన్న జవాబులను వెంటనే పంపించాలి.సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ బాషలలో అందించాలి.
  • సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలి.
  • ప్రతి శాఖ తరుపున ఒక నోడల్ అధికారిని నియమించాలి.
  • శాసనసభ కమిటీలకు అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం తరపున అందించాలి.
  • శాసనసభ పరిసరాలలో విద్రోహ శక్తులు, సంఘ విద్రోహులు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా భద్రత కట్టుదిట్టంగా ఉంచాలి.

చైర్మన్ గుత్తా గారు మాట్లాడుతూ…

Poultary
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అద్భుతమైన పథకాలను అమలు చేస్తోంది.
  • ప్రజా ప్రతినిధులు,అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రభుత్వానికి పేరును తీసుకువస్తున్నారు,తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ అత్యంత సమర్ధవంతమైనది.
  • లోపల సభ ప్రశాంతంగా జరగాలంటే బయట శాసనసభ పరిసర ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండాలి.
  • శాసనసభ సమావేశాల కోసం జారీ చేసిన పాస్ లు ఉన్న వారినే ఆవరణలోకి అనుమతించాలి.
  • గతంలోని సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఈసారి కూడా అదేవిధంగా జరిగే విదంగా తగిన చర్యలు తీసుకోవాలి.
Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here