ప్రపంచంలోనే తొలి 200 మెగా పిక్సెల్ స్మార్ట్ ఫోన్

ప్రపంచంలోనే తొలి 200 మెగా పిక్సెల్ స్మార్ట్ ఫోన్

ప్రపంచంలోనే తొలిసారిగా 200 మెగా పిక్సెల్ స్మార్ట్ ఫోన్ ను అమెరికాకు చెందిన మోటరోలా తయారు చేసింది. మోటో ఎక్స్‌ 30 ప్రో పేరుతో దీన్ని రూపొందించింది. ఆగస్ట్ 2వ తేదీన ఈ ఫోన్ చైనాలో విడుదల కానుంది. మొబైల్ ఫొటోగ్రఫీని ఇష్టపడే వారిని మరింతగా ఆకట్టుకోనుంది. దీని ధర రూ. 59,990గా ఉండవచ్చని భావిస్తున్నారు.

మీడియా కథనాల ప్రకారం … మోటో ఎక్స్‌ 30 ప్రోలో స్నాప్‌ డ్రాగన్ 8 ప్లస్‌ జనరేషన్‌ 1 ప్రాసెసర్‌ ఉంటుంది. 8జీబీ ర్యామ్‌ + 128జీబీ స్టోరేజీ … 12జీబీ ర్యామ్‌ + 256 జీబీ స్టోరేజీ రెండు వేరియంట్లలో దొరుకుతుంది. 6.73 ఇంచుల పి – ఓఎల్ ఈడీ డిస్ ప్లే ఆకట్టుకుంటుంది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 144 హెచ్‌.జెడ్‌ రిఫ్రెష్ రేట్‌ ఉంటాయి. 4500 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అమర్చారు. 125వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కల్పించారు. పిక్సెల్ రిజల్యూషన్ 15500 x 13000 గా ఉంటుంది.

అదిరిపోయే కెమెరా..:

Poultary

మోటో ఎక్స్‌ 30 ప్రోలో కెమెరా హైలైట్ గా చెప్పాలి. ఫోన్ వెనక భాగంలో 200 ఎంపీ (వైడ్ యాంగిల్), 50 ఎంపీ (అల్ట్రా వైడ్ యాంగిల్), 12 ఎంపీ (టెలిఫొటో) … ఇలా మూడు కెమెరాలు అమర్చారు. దీనిద్వారా అద్భుతమైన క్లారిటీతో ఫోటోలను తీసుకునేందుకు వీలు కలుగుతుంది. ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే 60 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ అమర్చారు. ఫుల్ హెచ్.డి 30 ఎఫ్.పి.ఎస్ వీడియో రికార్డింగ్ సదుపాయం ఇందులో ఉంది.

కాగా, ఎక్స్ పాండబుల్ మెమొరీ సదుపాయం లేకపోవడం, 5జీ నెట్ వర్క్ సపోర్ట్ చేయకపోవడం ఈ ఫోన్ లో కాస్త నిరాశపర్చే అంశాలని టెక్ నిపుణులు అంటున్నారు.

 

ALSO READ: దేశంలోనే సంపన్న మహిళ రోష్నీ నాడార్

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here