హెచ్.పి.ఎస్.ఆర్ లో స్వర్ణోత్సవ వేడుకలు ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, రామాంతపూర్ లో స్వర్ణోత్సవ వేడుకలు:

దేశంలో ఉన్న ఉన్నతమైన విద్యా సంస్థల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒకటని భారత ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు కొనియాడారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, రామాంతపూర్ లో స్వర్ణోత్సవ వేడుకలను ఆయన ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన గోల్డెన్ జూబ్లీ వింగ్ ను కూడా ప్రారంభించారు. ఇదొక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అకాడమిక్ బ్లాక్. విద్యార్థుల అభ్యాసాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఇది దోహదపడుతుంది. దీనితో పాటుగా మతన్ స్పోర్ట్స్ ఎరీనాకు శంకుస్థాపన చేశారు. ఒలింపిక్ స్టాండర్డ్స్ తో రూపుదిద్దుకుంటున్న ఈ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ … భావి భారత క్రీడాకారులను తయారుచేయనుంది. ఈ కార్యక్రమంలో శ్రీ మహమూద్ అలీ (హోం మంత్రి), శ్రీ సుభాష్ రెడ్డి (ఎమ్మెల్యే), శ్రీమతి వి. కరుణ – ఐ.ఎ.ఎస్ (విద్యాశాఖ కార్యదర్శి), శ్రీ ఏ శ్యామ్ మోహన్ (ప్రెసిడెంట్) , శ్రీ గస్టి జే నోరియా (వైస్ ప్రెసిడెంట్), శ్రీ ఎం.ఎ ఫైజ్ ఖాన్ (సెక్రెటరీ – హైదరాబాద్ స్కూల్ సొసైటీ), శ్రీ వేణు వినోద్ (ఛైర్మెన్ – గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్) తదితరులు పాల్గొన్నారు.

 

హెచ్.పి.ఎస్.ఆర్ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగస్వామి కావడం పట్ల ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులంతా మాతృభూమిని, మాతృభాషను ప్రేమించాలని సూచించారు. మాతృభాష కళ్ల లాంటిది అయితే … పర భాష కంటి అద్దాల వంటిదని తెలిపారు. భవిష్యత్ లో ఎదుగుదలకు క్రమశిక్షణ, సమయపాలన అత్యంత అవసరమని పేర్కొన్నారు. మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, యోగా వంటివి చేయాలని చెప్పారు. యోగా నాట్ ఫర్ మోడీ … ఫర్ యువర్ బాడీ అని వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని … కష్టపడే తత్వం అలవాటు చేసుకోవాలని సూచించారు. అప్పుడే జీవితంలో పైకి ఎదుగుతారని చెప్పారు.

Poultary

 

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, రామాంతపూర్ ఏర్పాటై 2022 ఆగస్ట్ 16 నాటికి 50 వసంతాలు పూర్తవుతాయి. అందరినీ ఎదిగేలా చేయడం, ముందుకు నడిపించడం, సేవాభావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా హెచ్.పి.ఎస్ ముందుకెళ్తోంది. ఇక్కడ చదివిన ఎందరో విద్యార్థులు వైద్యులుగా, ఆంట్రా ప్రెన్యూర్లుగా, కార్పొరేట్ లీడర్లుగా, శాస్త్రవేత్తలుగా, ఇంజినీర్లుగా రాణిస్తున్నారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నారు. అనేక ఇతర రంగాల్లోనూ హెచ్.పి.ఎస్ పూర్వ విద్యార్థులు సత్తా చాటుతున్నారు.

సువిశాలమైన ప్రాంగణం, అత్యంత నాణ్యమైన పాఠ్య ప్రణాళిక, సహ – పాఠ్య ప్రణాళికలకు హెచ్.పి.ఎస్.ఆర్ అసలైన చిరునామాగా నిలుస్తోందని హెచ్.పి.ఎస్, రామాంతపూర్ ప్రిన్సిపాల్ డాక్టర్ నర్సింహా రెడ్డి తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇవి ఎంతో స్ఫూర్తినిస్తాయని చెప్పారు. పాఠశాల విద్యలో గోల్డ్ స్టాండర్డ్‌ ఉండాలన్న మిషన్ కు అనుగుణంగా తాము పని చేస్తున్నట్టు పేర్కొన్నారు. పాఠ్యాంశాలు, సహ-పాఠ్యాంశాల స్థాయిని మరింత పెంచేందుకుగానూ గోల్డెన్ జూబ్లీ వింగ్, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లను అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారు.

 

ఇక గోల్డెన్ జూబ్లీ విషయానికి వస్తే … పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వేడుకలను ఇందులో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మరింత నాణ్యతతో విద్యను అందించడం, విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ వేడుకలు జరుగనున్నాయి. వైద్య సహాయం అందించేందుకు డాక్టర్స్ ఫోరమ్ ఏర్పాటు చేయడం, ఎస్ టిఇఎం & ఆంట్రా ప్రెన్యూర్ షిప్ వంటి వాటిలో మార్గదర్శనం ఇవ్వడం, ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించడం కోసం కృషి చేయనున్నారు. అంతేకాకుండా విభిన్న రంగాల్లో రాణించిన ప్రముఖ పూర్వ విద్యార్థులపై టేబుల్ బుక్ (పాఠశాల ప్రీమియం కలెక్టర్ ఎడిషన్ కాఫీ)ను కూడా ప్రచురించాలని హెచ్.పి.ఎస్ యోచిస్తోంది.

 

ALSO READ: సౌర‌శ‌క్తి వినియోగంలో మ‌రో విప్ల‌వం … ప్రింటెడ్ సోలార్ టెక్నాల‌జీ

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here