ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. వాట్సాప్ లో కూడా ఈ సేవలు పొందండి

ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. వాట్సాప్ లో కూడా ఈ సేవలు పొందండి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు బ్యాంకు సిద్ధమైంది. SBI తన కస్టమర్లు ఇప్పుడు వాట్సాప్ ద్వారా బ్యాలెన్స్ విచారణ మరియు మినీ స్టేట్‌మెంట్‌లను పొందవచ్చని ప్రకటించింది.

రిజిస్ట్రేషన్‌: ఈ సేవను ఉపయోగించడానికి మీరు ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. మీ మొబైల్ నంబర్ నుండి, WAREG అని టైప్ చేసి స్పేస్ ఇవ్వండి. మీ ఖాతా నంబర్‌ని టైప్ చేసి 72089 33148కి మెసేజ్‌ పంపండి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఈ మెసేజ్‌ను బ్యాంక్‌లో నమోదు చేసుకున్న మొబైల్ నంబర్ నుండి మాత్రమే పంపాలి. లేకపోతే, మీరు ఈ సేవ యొక్క ప్రయోజనాన్ని పొందలేరు.

సేవలను యాక్సెస్ చేయడానికి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి +91 90226 90226కు Hi WhatsApp సందేశాన్ని పంపండి. అక్కడ ఇచ్చిన నిర్దిష్ట సూచనలను అనుసరించడం ద్వారా మీకు అవసరమైన సేవను మీరు పొందవచ్చు.

Poultary

వాట్సాప్ నుండి పై నంబర్‌కు వాట్సాప్ ద్వారా “హాయ్” అని సందేశాన్ని పంపిన తర్వాత, మీకు SBI వాట్సాప్ బ్యాంకింగ్ సేవలకు స్వాగతం పలుకుతూ సందేశం వస్తుంది. దాని క్రింద మూడు సేవలు అందుబాటులో ఉన్నాయి

1. ఖాతా బ్యాలెన్స్‌

2.మినీ స్టేట్‌మెంట్‌

3. వాట్సాప్‌ బ్యాంకింగ్‌ సేవల రద్దు

ఈ మూడు ఎంపికలలో ఒకదానిని మీకు ఇష్టమైన ఎంపికగా ఎంచుకోండి. ఉదాహరణకు, మీకు మినీ స్టేట్‌మెంట్‌ అవసరమైతే, 2ని నమోదు చేయండి. SBI ఇప్పటికే తన క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు WhatsApp ఆధారిత సేవలను అందిస్తోంది. ఈ సేవల ద్వారా, కార్డ్ హోల్డర్లు రివార్డ్ పాయింట్లు, చెల్లించాల్సిన మొత్తం వంటి వివిధ సేవలను పొందవచ్చు. SBI కార్డ్ WhatsApp సేవల కోసం నమోదు చేసుకోవడానికి, OPTION అని టైప్ చేసి, 90040 22022కు మెసేజ్‌ పంపండి.మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 080809 45040కి చేయొచ్చు. హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, యుస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఇప్పటికే వాట్సాప్ ద్వారా వివిధ బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నాయి.

 

 

ALSO READ: 5వ రౌండ్ లోనూ రిషి సునాక్ విజయం

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here