నాణ్యమైన, అత్యుత్తమమైన వంట నూనెలకు ప్రసిద్ధి పొందిన ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. (Freedom Healthy Cooking Oil) కొనుగోలు సమయంలో ఒక పౌచ్ లో ఉండే నూనె నికర పరిమాణాన్ని తనిఖీ చేసేందుకు, జాగ్రత్తగా ఉండేందుకుగానూ కస్టమర్ల కోసం అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది.
Are You Buying Right? (మీరు సరైనది కొనుగోలు చేస్తున్నారా?) అంటూ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. (Freedom Healthy Cooking Oil)
Freedom Healthy Cooking Oil ప్రతీ లీటర్ కు 910 గ్రాముల నూనె:
లీటర్ నూనె ప్యాకెట్ కొనుగోలు చేసినప్పుడు ఆ వంట నూనె పరిమాణాన్ని తనిఖీ చేసేందుకు ధ్యాన్-సే-లిజియే అనే ప్రచారాన్ని ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ ఇదివరకే ప్రారంభించింది.
దానికి పొడగింపుగా కొత్త క్యాంపెయిన్ ను మొదలుపెట్టింది. భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం, ప్రతీ 1 లీటర్ సన్ ఫ్లవర్ ఆయిల్ 910 గ్రాముల నూనెను కలిగి ఉండాలి.
అయితే కొన్ని బ్రాండ్‌లు 1 లీటర్ ప్యాక్ లా కనిపించే ప్యాక్ ను తక్కువ పరిమాణంలో (850-870 గ్రాములు) వంట నూనెతో విక్రయిస్తున్నాయి. దీనిపై అవగాహన కల్పించేందుకు ఫ్రీడం ఆయిల్ క్యాంపెయిన్ ఉపయోగపడుతుంది.
వినియోగదారులకు అవగాహన:
Are You Buying Right? అనే ప్రచారం.. వంట నూనె ప్యాకెట్ కొనే ముందు ఆ ప్యాక్ పై పేర్కొన్న ఆయిల్ పరిమాణాన్ని తనిఖీ చేసేలా వినియోగదారులను ప్రోత్సహిస్తుంది. దీనివల్ల కస్టమర్లు మోసపోకుండా ఉంటారు.
ప్రజలకు అవగాహన కల్పించేందుకు, వాళ్లు అప్రమత్తంగా ఉండేందుకు ఈ క్యాంపెయిన్ ఉపయోగపడుతుంది. తక్కువ నూనెతో 1 లీటర్ పౌచ్ ను పోలి ఉండే నూనె ప్యాకెట్ ను కొని మోసపోవద్దని హెచ్చరిస్తుంది.
ప్యాక్ ను తిప్పి అందులోని నూనె పరిమాణాన్ని తనిఖీ చేసేలా, ప్యాక్ పై పేర్కొన్న పరిమాణానికి సరైన ధరను చెల్లించేలా సూచిస్తుంది.
ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ ఫ్లవర్ ఆయిల్ ప్రతీ లీటర్ పౌచ్ లో 910 గ్రాముల శుద్ధి చేసిన సన్ ఫ్లవర్ ఆయిల్ ఉందనే గ్యారెంటీని కూడా ఈ ప్రచారం హైలైట్ చేస్తుంది.
కాగా, ఆర్ యు బైయింగ్ రైట్ ? అనే ప్రచారం వినియోగదారుల సాధికారత పట్ల తమ నిబద్ధతను తెలియజేస్తుందని జెమినీ ఎడిబుల్స్, ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్‌లో సేల్స్ & మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి. చంద్రశేఖర రెడ్డి తెలిపారు.
ఏదైనా బ్రాండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ ను కొనుగోలు చేసే ముందు ప్యాక్ లోని వంట నూనె పరిమాణాన్ని తనిఖీ చేయడం అవసరమని చెప్పారు.
ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ ప్రతీ 1 లీటర్ పౌచ్ లో 910 గ్రాముల ఎడిబుల్ ఆయిల్ ఉంటుందని హామీ ఇచ్చారు.
కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా నూనె పరిమాణాన్ని తనిఖీ చేయాలని ఆయన వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.