బెంగ‌ళూరు, ముంబై, హైద‌రాబాద్ లాంటి పెద్ద న‌గ‌రాల్లో ట్రాఫిక్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. కొద్ది కిలోమీట‌ర్ల ప్ర‌యాణమైనా స‌రే గంట‌ల త‌ర‌బ‌డి రోడ్ల‌మీద ఉండాల్సిందే..! Electric Air Taxi ఆఫీస్ అవ‌ర్స్ లో అయితే ఆ ర‌ద్దీ మామూలుగా ఉండ‌దు. టూ వీల‌ర్ అయినా, ఫోర్ వీల‌ర్ అయినా అదే ప‌రిస్థితి..! *(Electric Air Taxi)*

మెట్రో రైళ్ల‌తో టైమ్ కాస్త క‌లిసొచ్చినా కూడా ఆ ర‌ష్ భ‌రించ‌డం సాధ్యం కాదు. ఈ ప‌రిస్థితుల్లో ట్రాఫిక్ స‌మ‌స్య‌కు చెక్ పెట్టేందుకు ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి రాబోతున్నాయి. మ‌రి వాటిలో జ‌ర్నీ ఎలా ఉంటుంది? ఎంత ఛార్జీ వ‌సూలు చేస్తారు? ఎప్ప‌టి నుంచి ఎయిర్ టాక్సీ సేవ‌లు వినియోగించుకోవ‌చ్చు? ఇలాంటి పూర్తి స‌మాచారం మీ కోసం.

2026 నాటికి అందుబాటులోకి:

Flying Air Taxi..! ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా వినిపిస్తున్న పేరు..! విదేశాల్లో కొన్ని చోట్ల వీటి సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. భార‌త్ లోనూ Flying Air Taxi లు తీసుకొచ్చేందుకు ప్ర‌ముఖ సంస్థ‌లు పోటీ ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్‌ ఎంటర్ ప్రైజెస్ ఇటీవ‌ల కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. 2026 నాటికి మ‌న దేశంలో ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి తీసుకురాబోతున్న‌ట్టు వెల్ల‌డించింది.

Poultary

పూర్తి స్థాయి ఎల‌క్ట్రిక్ ఎయిర్ టాక్సీల‌ను ఇంట‌ర్ గ్లోబ్ ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ఇందుకుగానూ అమెరికా సంస్థ ఆర్చర్‌ ఏవియేషన్ తో ఒప్పందం చేసుకుంది. ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి వ‌స్తే జ‌ర్నీ స‌మ‌యం చాలా ఆదా అవుతుంది.

Flying Air Taxi in hyderabad
Flying Air Taxi in hyderabad

ఉదాహ‌ర‌ణ‌కు ఢిల్లీ నుంచి గుర్ గ్రామ్ కు రోడ్డు మార్గంలో వెళ్తే దాదాపు రెండు గంట‌లు ప‌డుతుంది. అదే ఎయిర్ టాక్సీలో అయితే జ‌స్ట్ 7 నిమిషాల్లో చేరుకోవ‌చ్చు. వీటిలో పైలట్ తో పాటు మ‌రో న‌లుగురు ప్ర‌యాణించవ‌చ్చు. ఇవి చూసేందుకు పెద్ద సైజు డ్రోన్ల మాదిరిగా ఉంటాయి.

ఎల‌క్ట్రిక్ Flying Air Taxi ల కోసం ఇంట‌ర్ గ్లోబ్ దాదాపు 8 వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌నుంద‌ని స‌మాచారం. మొద‌ట‌గా ఢిల్లీలో వీటిని అందుబాటులోకి తెస్తార‌ని తెలుస్తోంది. ఆ త‌ర్వాత ముంబై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్ లో ఎయిర్ టాక్సీలు వ‌స్తాయి.

ఇక ఛార్జీల విష‌యానికొస్తే 7 నిమిషాల జ‌ర్నీకి సుమారు 2 వేల నుంచి 3 వేల వ‌ర‌కు వ‌సూలు చేసే ఛాన్స్ ఉంది. ఈ ఎయిర్ టాక్సీల్లో 6 బ్యాటరీ ప్యాక్ లు ఉంటాయి. ఫుల్ ఛార్జింగ్ కు సుమారు 40 నిమిషాలు ప‌డుతుంది. ఒక‌సారి ఫుల్ చార్జింగ్ చేస్తే 40 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించొచ్చు.

అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే మ‌రో రెండేళ్ల‌లో ఎయిర్ టాక్సీల్లో ఎంచ‌క్కా చ‌క్క‌ర్లు కొట్టొచ్చు. ట్రాఫిక్ ను త‌ప్పించుకుని ప్ర‌యాణించొచ్చు. మ‌రి రాబోయే రోజుల్లో ఎయిర్ టాక్సీలు ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాయో లెట్స్ వెయిట్ అండ్ సీ.

- పి.వంశీకృష్ణ‌
Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here