Tech Capital Of India అయిన బెంగ‌ళూరుకు ఏమైంది? గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని water crisisను ఎందుకు ఫేస్ చేస్తోంది? ఎక్క‌డ చూసినా నీటిక‌ట‌క‌ట‌. ఒక‌వైపు భూగ‌ర్భ జ‌లాలు అడుగంటాయి. బోర్లు ఎండిపోయాయి. మ‌రోవైపు న‌దుల్లోనూ నీళ్లు లేవు. ఇప్ప‌ట్లో వ‌ర్షాలు కూడా ప‌డ‌వు. ఇలాంటి ప‌రిస్థితుల్లో బెంగ‌ళూరువాసులు చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. తాగ‌డానికి గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్నారు. ఇంత‌కీ బెంగ‌ళూరు ఇలా ఎందుకు త‌యారైంది? నీటి క‌ట‌క‌ట‌కు కార‌ణాలేంటి? అస‌లు ఆ న‌గ‌రం ఎలా మార‌బోతోంది? ఈ పూర్తి వివ‌రాలు మీ కోసం.

దయనీయంగా మారిన పరిస్థితి:

కొద్దిరోజుల కింది వ‌ర‌కు క‌ళ‌క‌ళ‌లాడిన బెంగ‌ళూరు ఇప్పుడు దోసెడు నీటి కోసం అల్లాడుతోంది. క‌నీసం తాగేందుకు నీళ్లు లేక జ‌నం అల్లాడిపోతున్నారు. ఎక్క‌డ చూసినా water crisis. ముఖ్యంగా Whitefield, KR Puram, Electronic City, RR Nagar, Kengeri, CV Raman Nagar వంటి ప్రాంతాల్లో ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. ఆఫీసుల్లో నీళ్లు లేక‌పోవ‌డంతో చాలా కంపెనీలు మ‌ళ్లీ Work From Home విధానాన్ని అమ‌లు చేస్తున్నారు. కొన్ని చోట్ల‌యితే స్కూళ్ల‌ను మూసేశారు. జ‌నం రెండు, మూడు రోజుల‌కోసారి స్నానం చేస్తున్నారంటే Situation ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

Poultary

నీటి కొరత ఎలా ఉందంటే?

బెంగ‌ళూరులో సాధార‌ణంగా water requirement 2600 నుంచి 2800 Million Liters Per Dayగా ఉంటుంది. కానీ ప్ర‌భుత్వం కేవ‌లం 1300 Million Liters Per Day మాత్ర‌మే స‌ర‌ఫ‌రా చేయ‌గ‌లుగుతోంది. అంటే స‌గం అవ‌స‌రాల‌కు కూడా ఆ నీరు స‌రిపోవ‌డం లేద‌న్న‌మాట‌. ట్యాంక‌ర్లు వ‌స్తున్నా కూడా కొర‌త తీర‌డం లేదు. అటు, వాటి రేట్లు కూడా అమాంతం పెంచేశారు. మొన్న‌టి వ‌ర‌కు 600 ఉంటే ఇప్పుడు 2 వేలు చేశారు. బెంగ‌ళూరులో గ‌త 30, 40 ఏళ్ల‌లో నీటి క‌రువు ఇంత‌లా ఎప్పుడూ లేక‌పోవ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం.

కారణాలేంటి?:

భారీగా Urbanization, built up areas వివ‌ప‌రీతంగా పెరిగిపోవ‌డం, స‌రైన water schemes అమ‌లు చేయ‌క‌పోవ‌డం బెంగ‌ళూరులో నీటి కొర‌త‌కు కొన్ని కార‌ణాలు. అలాగే rainwaterపై ఎక్కువ‌గా ఆధార‌ప‌డ‌టం, groundwaterను అతిగా వాడ‌టం, వ‌ర్షాభావ ప‌రిస్థితులు వాటికి తోడ‌య్యాయి. దీంతో, బెంగ‌ళూరు ఈ స్థితికి చేరింది. దీన్ని ఎదుర్కొనేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా, ఎన్ని నిబంధ‌న‌లు విధించినా ఫ‌లితం మాత్రం శూన్యం.

దాదాపు మూడు నెల‌లుగా బెంగ‌ళూరులో ఇదీ ప‌రిస్థితి. ఎప్పటికి ఇది మారుతుంది? జ‌నాల‌కు నీటి క‌ష్టాలు ఎప్పుడు తీరుతాయి? న‌గ‌రం తిరిగి మామూలు స్థితికి ఎప్పుడు వ‌స్తుంది? ఒక్క బెంగళూరేనా లేక మిగతా నగరాలు కూడా ఇలాగే అవుతాయా? ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే చెపుతుంది.

- పి. వంశీకృష్ణ
Bharati Cement