2024-25కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్. రాబోయే ఆర్థిక సంవత్సరం మొత్తానికీ పద్దు ప్రతిపాదనలు చేసినప్పటికీ.. జూన్ వరకు మాత్రమే ప్రభుత్వం చేయబోయే ఖర్చులకు ఆమోదం లభిస్తుంది. శాసనసభ ఎన్నికల తర్వాత కొలువుదీరే కొత్త సర్కారు పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది.
బడ్జెట్ హైలైట్స్..!
- ఉదయం 11.03 నిమిషాలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైంది
- ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్
- రూ. 2,86,389 కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్
- రెవెన్యూ వ్యయం – రూ. 2,30,110 కోట్లు
- మూల ధన వ్యయం – రూ. 30,530 కోట్లు
- రెవెన్యూ లోటు – రూ. 24,758 కోట్లు
- ద్రవ్య లోటు – రూ.55,817 కోట్లు
- ఏపీ స్థూల ఉత్పత్తిలో 3.51 శాతం మేర ద్రవ్యలోటు
- రెవెన్యూ లోటు – 1.56 శాతం
- బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్
- బడ్జెట్ లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం
- 1000 స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్ అమలు
- ప్రతీ జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు
- కుప్పంతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు
- లక్షా 35 వేల మంది ఉద్యోగులతో గ్రామ సచివాలయాలు ఏర్పాటు
- గడపగడపకూ పాలన కోసం రెండున్నర లక్షల మంది వాలంటీర్లు
- విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు 9 లక్షలకు పైగా ట్యాబ్ ల పంపిణీ
- పరిపూర్ణ మానవ వనరుల అభివృద్ధే ధ్యేయంగా సామర్థ్య ఆంధ్ర
- ప్రతి ఏడాది 47 లక్షల మంది విద్యార్థులకు ప్రీ-స్కూల్ కిట్స్ పంపిణీ
- 99 శాతానికిపైగా స్కూళ్లతో కనీస మౌలిక వసతులు కల్పన
- నాడు-నేడు పథకం అమలుకు రూ. 16 వేల కోట్లకు పైగా ఖర్చు
- ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 25 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు
- ఫ్యామిలీ డాక్టర్ అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం
- అమ్మఒడి పథకం ద్వారా 43.61 లక్షల మంది ఖాతాల్లో రూ.26,067 కోట్లు జమ
- వైఎస్ఆర్ ఆసరా కింద రూ.25,571 కోట్ల బకాయిల చెల్లింపు
- గత ఐదేళ్లలో రాష్ట్ర రహదారుల అభివృద్ధకి రూ. 2626 కోట్ల వ్యయం
- 2023 నవంబర్ నాటికి భారత్ నెట్ ప్రాజెక్ట్ రెండో దశ పూర్తి
- దీని ద్వారా 55 వేల కి.మీ. మేర ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ఏర్పాటు
- కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలల మంజూరు
- పోలవరం ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ లో పురోగతి
- 2019 నుంచి ఇప్పటి వరకు ఏపీలో ఏర్పాటైన 311కిపైగా భారీ, మెగా పరిశ్రమలు
- ఈ పరిశ్రమల ద్వారా లక్షా 30 వేల మందికి ఉపాధి
- అవుకు రెండు టన్నెళ్ల నిర్మాణం పూర్తి, కొనసాగుతున్న మూడో సొరంగం పనులు
- ఎంఎస్ఎంఈల ద్వారా 13.67 లక్షల మందికి దక్కిన ఉపాధి
- గత ఐదేళ్లలో 4.93 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన.. వాటిలో 2.13 లక్షలు శాశ్వత నియామకాలు
- పి. వంశీకృష్ణ