ఘనంగా ప్రారంభమైన iPHEX 2023 అంతర్జాతీయ సదస్సు
• iPHEX(అంతర్జాతీయ ఫార్మా ఎగ్జిబిషన్) 9వ ఎడిషన్
• 2023 జులై 5,6,7 హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైదరాబాద్
iPHEX(అంతర్జాతీయ ఫార్మా ఎగ్జిబిషన్) 9వ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PHARMEXCIL),భారత ప్రభుత్వ వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ మద్దతుతో జులై 5,6,7 తేదీల్లో హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఫ్లాగ్షిప్ ఈవెంట్ ను ప్రారంభించింది.
ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి ఎస్.వి. వీరమణి ఫార్మెక్సిల్ చైర్మన్ మాట్లాడుతూ ప్రపంచంలోని 200 దేశాలను చేరుకోవడంలో మన భారతీయ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ ప్రత్యేకతను చాటుకుందని గుర్తుచేశారు. గత ఏడాది 25.39 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఎగుమతులు చేశామని, ఈ ఏడాది 28 బిలియన్ డాలర్ల లక్ష్యానికి చేరుకోవడానికి మంచి నాణ్యత, విశ్వసనీయమైన మరియు సరసమైన సూత్రీకరణలు, API, వ్యాక్సిన్లు, ఆయుష్, హెర్బల్స్ మరియు సర్జికల్ల వల్ల లక్ష్యం సాధ్యమవుతందని ఆయన పేర్కొన్నారు. . అందువల్ల, భారతదేశం నుండి ఎగుమతి చేయబడిన అన్ని వస్తువులలో
అందువల్ల భారత దేశం నుండి ఎగుమతుల్లో 5 వ అతి పెద్ద రంగం గా ఎదిగింది మన పార్మా ఇండస్ట్రీ, అలాగే భారత ప్రభుత్వంచే సంభావ్య రంగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఫార్మా రంగం. ఈ సదస్సులో దాదాపు 400 మంది ఎగ్జిబిటర్లు, 660 మంది విదేశీ సందర్శకులు, భారతదేశం మరియు విదేశాల నుండి 10000 మందికి పైగా సందర్శకులు విచ్చేయనున్నారు ,ఇంకా ఎన్నో సమావేశాలు, CEO ప్యానెల్ సదస్సులు , G20 దేశాలతో ఎగుమతి అవకాశాలు లాంటి ఎన్నో విన్నూతమైన ప్రదర్శనలు, సమావేశాలు ఉండబోతున్నాయి.
దాదాపు 200 దేశాలకు నాణ్యమైన, సరసమైన జనరిక్ ఔషధాలను సరఫరా చేయడం ద్వారా ఆరోగ్య సంరక్షణకు గణనీయమైన సహకారం అందించడంలో భారతీయ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ ప్రత్యేక గుర్తింపును పొందిందని అందుకే “ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్” గా మారిందన్నారు.
ఈ ఎగ్జిబిషన్ వ్యాపారాన్ని పెంచుకునేందుకు ప్రపంచ దేశాల సాంకేతికను పంచుకునేందుకు విస్తృత అవకాశాలను కల్పిస్తుంది. అంతేకాకుండా ఎక్స్పో & బిజినెస్ సమావేశాలతో పాటు, దిగువ విషయాలపై ప్యానెల్ సమావేశాలు నిర్వహించబడతాయి.
1. G20 దేశాల మధ్య సంభావ్య సహకారాలు భారతీయ ఫార్మా వ్యాపార అవకాశాలు.
2. భారతీయ ఫార్మాస్యూటికల్ రంగం – అంతర్జాతీయ వాణిజ్య స్థాయి.
3. నాణ్యత వర్తింపు, రోగి భద్రత
4. బయోసిమిలర్స్
5. టీకాలు
విదేశీ మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీల కోసం హైదరాబాద్లోని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ సౌకర్యాల ఫ్యాక్టరీ టూర్, భారతీయ పరిశ్రమ అనుసరిస్తున్న స్టాండర్డ్స్ & బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి వారికి తెలియజేయడానికి ప్లాన్ చేయబడింది.
ఈ iPHEX ఖచ్చితంగా భారతీయ ఔషధ పరిశ్రమ సామర్థ్యాలను ప్రదర్శించడానికే కాకుండా ప్రపంచ వాటాదారులలో విశ్వాసాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది.
ఈ కార్యక్రమంలో
1. Tushar Khorday, iPHEX Chairman
2. Shri. Ravi Udaya Bhaskar, Director General, Pharmexcil
3. Dr.Rajeev Singh Raghuvanshi, DCG(I), CDSCO, Govt of India
4. Smt. Indu Nair, Joint Secretary EP- PHARMA, DoC
5. Honourable Dr Lino Tom – PNG Minister for Health
6. Shri S V Veeramani, Chairman, Pharmexcil
7.Sri. Madan Mohan Reddy, Co-Chair IPA International Trade Committee.
8.Shri Namit Joshi, Vice – Chairman, Pharmexcil పాల్గొన్నారు