జూలై 28 నుంచి కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం
కామన్వెల్త్ గేమ్స్ – 2022 ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హామ్ వేదికగా ఆగస్ట్ 8 వరకు ఇవి జరగనున్నాయి. భారత్ సహా 72 దేశాలు ఇందులో పాల్గొంటాయి. 20 క్రీడలకు సంబంధించి 280 పోటీలను నిర్వహించనున్నారు. 5 వేల మందికి పైగా అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. కామన్వెల్త్ గేమ్స్ 2022 కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 15 వేదికల్లో క్రీడలను నిర్వహించనున్నారు.
భారత్ నుంచి 200 మందికి పైగా క్రీడాకారులు ఈ మెగా ఈవెంట్ లో పాల్గొంటున్నారు. దాదాపు అన్ని విభాగాల్లో వారంతా పోటీ పడనున్నారు. మహిళల క్రికెట్ కు తొలిసారిగా సి.డబ్ల్యూ.జిలో అవకాశం కల్పించారు. దీంతో ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ కూడా ఇందులో పాల్గొంటోంది. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా … ఓపెనింగ్ సెరిమొనీలో ఫ్లాగ్ బేరర్ గా వ్యవహరించనున్నారు.
భారత్ పోటీ పడే విభాగాలు:
బ్యాడ్మింటన్ మిక్స్ డ్ డబుల్స్, పురుషుల మారథాన్, పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ చేజ్, పురుషుల లాంగ్ జంప్, మహళల 100 మీటర్ల హర్డిల్స్, మహిళల డిస్కస్ త్రో, మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్, పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్, మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్, పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్, పురుషుల జావెలిన్ త్రో, పురుషుల ట్రిపుల్ జంప్, పురుషుల 10 కి.మీ రేస్ వాక్, మహిళల లాంగ్ జంప్, మహిళల హ్యామర్ త్రో, పురుషుల 4X400 మీటర్ల రిలే, మహిళల 10 కి.మి రేస్ వాక్, మహిళల 4X100 మీటర్ల రిలే, మహిళల క్రికెట్, పురుషుల హాకీ, మహిళల హాకీ, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్.
2018లో గోల్డ్ కోస్ట్ లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ 64 పతకాలను సాధించింది. 25 గోల్డ్, 19 సిల్వర్, 20 బ్రాంజ్ మెడల్స్ వాటిలో ఉన్నాయి. ఈ సారి అంతకు మించి మెడల్స్ సాధించేందుకు క్రీడాకారులు సిద్ధమయ్యారు. ఎల్లుండి నుంచి మొదలయ్యే గేమ్స్ ను సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో వీక్షించవచ్చు.
ALSO READ: నేటి నుంచి 5జీ స్పెక్ట్రమ్ వేలం