ప్రపంచంలోనే మొదటి రవాణా ఫిన్ టెక్ సంస్థ అయిన మూవ్.. దేశంలో అతిపెద్ద వెంచర్ డెబిట్ ఫండ్ అయిన స్ట్రయిడ్ వెంచర్స్ నుంచి కొత్తగా 10 మిలియన్ డాలర్ల డెబిట్ ఫండింగ్ పొందింది. ఇండియాలో బయట నుంచి సంస్థకు మొదటిసారిగా లభించిన రుణం ఇదే. రవాణారంగ పెట్టుబడిదారులకు సులభంగా వాహనాలను అందించాలన్న మూవ్ ఆలోచనకు ఇది మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఈ ఫండ్ ను మూవ్.. ఢిల్లీ, పూణె, కోల్ కతా లకు విస్తరించడం ద్వారా దేశంలో సంస్థ ఉనికిని బలోపేతం చేయడానికి ఉపయోగించనుంది. ఇండియన్ మార్కెట్లో నికరంగా పెరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మూవ్ తమ వాహనాల సంఖ్యను 5,000లకు పైగా పెంచబోతోంది. ఏడాది కిందట గుర్ గావ్ కేంద్రంగా ఇండియాలో కార్యకలాపాలు ప్రారంభించిన మూవ్.. ప్రస్తుతం బెంగళూరు, ముంబై, హైదరాబాద్ లో ఉనికిని విస్తరించింది.
భాగస్వామ్యం పట్ల హర్షం..:
స్ట్రయిడ్ వెంచర్స్ తో భాగస్వామ్యం పట్ల మూవ్ సంస్థ ఇండియా & సౌత్ ఏషియా రీజనల్ మేనేజింగ్ డైరెక్టర్ బినోద్ మిశ్రా సంతోషం వ్యక్తం చేశారు. “మూవ్.. ప్రభావశీల విధానాల నమూనాకు, పురోగతి సామర్థ్యానికి నిదర్శనంగా వుండడమేకాక, 10 మిలియన్ డాలర్ల రుణ మొత్తానికి అదనంగా మార్గం కూడా సుగమం చేస్తోంది. మా వాహనాలు భారతదేశంలో 42 లక్షల ట్రిప్పులను పూర్తి చేశాయి. ఇండియాలో రవాణా రంగాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. స్ట్రయిడ్ వెంచర్స్ మద్దతుతో లక్ష్య సాధన దిశగా మరింత ముందుకు సాగగలమన్న ధీమాతో ఉన్నాం” అని తెలిపారు.
ఫిన్టెక్, రవాణా పరిశ్రమలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మూవ్ వంటి సంస్థలకు మద్దతుగా నిలవడం పట్ల స్ట్రయిడ్ వెంచర్స్ మేనేజింగ్ పార్ట్ నర్ అపూర్వ శర్మ హర్షం వ్యక్తం చేశారు. “మూవ్ తో ఈ భాగస్వామ్యం.. దేశమంతటా వాహన యాజమాన్య యాక్సెసబిలిటీని మారుస్తుంది. సామాజికంగా, ఆర్థికంగా ముందడుగు వేసేందుకు ఇది దోహదపడుతుంది” అని చెప్పారు.
మూవ్ గురించి..:
మూవ్ సంస్థను 2020లో స్థాపించారు. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, యూరప్, ఆసియా తదితర ప్రాంతాల్లో తొమ్మిది మార్కెట్లలో మూవ్.. ఇఎంఇఎ ప్రాంతంలో ఉబర్ కు నంబర్ 1 సరఫరా భాగస్వామిగా ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మూవ్ ద్వారా రుణం పొందిన వాహనాలు 3 కోట్ల ట్రిప్పులు పూర్తి చేశాయి. మూవ్ గురించి మరింత సమాచారం కోసం https://www.moove.io/en-IN వెబ్ సైట్ లో సంప్రదించగలరు