తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది..! సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకు పైగా జరిగిన భేటీలో వివిధ అంశాలపై చర్చించింది..! బడ్జెట్ సమావేశాలు, ఆరు గ్యారెంటీల్లో భాగంగా మరో రెండు పథకాల అమలు తదితర విషయాలపై మంత్రివర్గం సుదీర్ఘ చర్చ జరిపింది..!
-
కేబినెట్ భేటీ పూర్తి వివరాలు..: - 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపాలని నిర్ణయం
- తొలిరోజు సభలో గవర్నర్ ప్రసంగం.. మరునాడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం
- 10వ తేదీన సభ ముందుకు బడ్జెట్
- గృహావసరాలకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 500 రూపాయలకే సిలిండర్ అందజేసే పథకాల అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
- బీసీ కుల గణన చేయాలని నిర్ణయం
- రాష్ట్ర ఆత్మగౌరవానీకి ప్రతీకగా నిలిచే తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయం
- ప్రజాకవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణను రాష్ట్ర అధికారిక గీతంగా గుర్తిస్తూ కేబినెట్ ఆమోదం
- తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ ను కేంద్ర ప్రభుత్వ గెజిట్ ప్రకారం TS నుంచి TGగా మార్చాలని నిర్ణయం
- కొడంగల్ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయాలని మంత్రివర్గ తీర్మానం
- తెలంగాణ హైకోర్టుకు వంద ఎకరాలు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్
- 65 ఐటీఐ కాలేజీలను Advanced Technology Centersగా అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయం
- వ్యవసాయ శాఖలో ఏఈవో పోస్టుల భర్తీకి ఆమోదం
- సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష.. వారి విడుదలకు కేబినెట్ అంగీకారం
- పి. వంశీకృష్ణ