CM Revanth Reddy Launches T Safe App

ప్ర‌యాణ స‌మ‌యంలో పౌరుల ర‌క్ష‌ణే ల‌క్ష్యంగా రేవంత్ స‌ర్కారు ప‌ని చేస్తోంది. ముఖ్యంగా మ‌హిళ భ‌ద్ర‌త‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తోంది. వారు సుర‌క్షితంగా గ‌మ్య‌స్థానాల‌ను చేరే వ‌ర‌కు ప‌ర్య‌వేక్షించేలా స‌రికొత్త సేవ‌ల్ని అందుబాటులోకి తెచ్చింది. అదే ట్రావెల్ సేఫ్ లేదా టీ-సేఫ్. స‌చివాల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఈ సేవ‌ల‌ను ప్రారంభించారు. ప‌లువురు మంత్రులు, ఉన్న‌తాధికారులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

టీ-సేఫ్ ఎలా ప‌ని చేస్తుంది..?

టీ-సేఫ్ సేవ‌లు పొందేందుకు స్మార్ట్ ఫోన్ లేదా ఎలాంటి యాప్ అవ‌స‌రం లేదు. బేసిక్ మొబైల్ ఉన్నా స‌రిపోతుంది. అందులో నుంచి 100 లేదా 112 నంబ‌ర్ల‌కు డ‌య‌ల్ చేసి ఐవీఆర్ ఆప్ష‌న్ లో 8 నొక్క‌డం ద్వారా ఈ స‌ర్వీస్ ను వినియోగించుకోవచ్చు. డ‌య‌ల్ చేసిన త‌ర్వాత ఆటోమేటెడ్ లింక్ వ‌స్తుంది. ట్రావెల్ సేఫ్ అప్లికేష‌న్ లేదా టీ-సేఫ్ వెబ్ పేజీ ద్వారా ఈ స‌దుపాయాన్ని వినియోగించుకోవ‌చ్చు.
టాక్సీలు, ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ సేవ‌లు అందించే సంస్థ‌లను టీ-సేఫ్ తో అనుసంధానం చేసేందుకు ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్లాన్ చేస్తోంది. ఇలాంటి సేవ‌లు అందుబాటులోకి రావ‌డం దేశంలోనే ఇదే తొలిసారి కావ‌డం విశేషం. ఏదైనా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఎదురైతే లైవ్ ట్రాకింగ్ లింక్ ను కూడా పోలీస్ పెట్రోలింగ్ వాహ‌నానికి టీ-సేఫ్ చేర‌వేస్తుంది. పోలీసులు త‌క్ష‌ణ‌మే స్పందించేందుకు దోహ‌ద‌ప‌డుతుంది.

రియ‌ల్ టైమ్ లొకేష‌న్ పంపొచ్చు..:

ఒంట‌రిగా ప్ర‌యాణం చేసే వాళ్లు లేదా మ‌హిళ‌లు రియ‌ల్ టైమ్ లొకేష‌న్ ను వారి కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌కు పంపే వీలు క‌ల్పిస్తుంది టీ-సేఫ్. ట్రిప్ లో సేఫ్టీ అప్ డేట్స్ ఆటోమెటిక్ గా తెలిసిపోతాయి. రూట్ లో ఏదైనా మార్పు జ‌రిగితే వెంట‌నే పోలీసుల‌ను సిస్టం అల‌ర్ట్ చేస్తుంది. టీ-సేఫ్ అన్ని ఫోన్ల‌లో ప‌ని చేస్తుంది.. అంద‌రికీ అందుబాటులో ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా 700కు పైగా పెట్రోలింగ్, 1000కి పైగా బ్లూ కోట్స్ వాహ‌నాల‌ను టీ-సేఫ్ తో అనుసంధానం చేస్తారు. మొత్త‌మ్మీద పౌరుల ప్ర‌యాణాన్ని మ‌రింత సుర‌క్షితంగా మార్చేందుకు టీ-సేఫ్ ఉప‌యోగ‌ప‌డ‌నుంది.

Poultary
- పి. వంశీకృష్ణ‌
Bharati Cement