హై బిజ్ టీవీ ఫుడ్ అవార్డ్స్ 3వ ఎడిషన్ ఈ నెల 24న జరుగబోతోంది. దీనికి సంబంధించిన ట్రోఫీ & పోస్టర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది,. హైదరాబాద్ లోని మెర్క్యూర్ హోటల్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పి. చంద్రశేఖర్ రెడ్డి (సీనియర్ వీపీ సేల్స్ & మార్కెటింగ్ – జెమిని ఎడిబుల్స్ & ఫ్యాట్స్ ఇండియా), దుర్గా ప్రసాద్ (డైరెక్టర్ – శ్రీ చక్ర మిల్క్), సందీప్ ఆదివిష్ణు (సీనియర్ వీపీ – మోల్డ్ టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్), రామకృష్ణా రెడ్డి, ఆపరేషన్స్ హెడ్, జానకి ఫ్రెష్ చికెన్ – విమలా ఫీడ్స్ ,ఎం. రాజ్ గోపాల్ (మేనేజింగ్ డైరెక్టర్ – హైబిజ్ టీవీ & తెలుగు నౌ), డాక్టర్ జె. సంధ్యారాణి (మేనేజింగ్ డైరెక్టర్ – హైబిజ్ టీవీ ఎల్.ఎల్.పి) ఇందులో పాల్గొన్నారు.
హైదరాబాద్ ను ఫుడ్ గ్రాఫ్ లో అత్యున్నత స్థానానికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన వ్యక్తులను.. ఫుడ్ అవార్డ్స్ 3వ ఎడిషన్ లో భాగంగా హైబిజ్ టీవీ సత్కరించనుంది. వారితోపాటు హోటళ్లు, రెస్టారెంట్లు, జ్యూస్ ఔట్ లెట్లు, బేకరీలు, మండి మొదలగు విభాగాల్లో సర్వీస్ అందిస్తున్న బ్రాండ్ లకు పురస్కారాలను అందజేయనుంది. హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో ఆగస్టు 24న ఈ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి దీనికి ముఖ్యతిథిగా హాజరవుతారని చెప్పారు.
హైబిజ్ టీవీ ఇప్పటికే మీడియా, ఉమెన్ లీడర్ షిప్, హెల్త్ కేర్, రియల్టీ, ఎడ్యుకేషన్ అవార్డ్స్ ను విజయవంతంగా నిర్వహించింది. వాటితో పాటు టీ ఛాంపియన్ షిప్, ఐస్ ట్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ ఈవెంట్స్ ను సక్సెస్ ఫుల్ గా చేపట్టింది. అలాగే ఆహార పరిశ్రమలో ప్రొఫెషనల్స్ కు ప్రోత్సాహాన్ని అందించేందుకు ఫుడ్ అవార్డ్స్ ప్రదానం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే రెండు ఎడిషన్స్ ను దిగ్విజయంగా పూర్తి చేసింది. ఈ సారి మూడో ఎడిషన్ ను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా 50కి పైగా కేటగిరీల్లో అవార్డులను ప్రదానం చేయనుంది.
ఇందులో పాల్గొనాలనుకునే వాళ్లు ఈ నెల 18లోగా నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. హైబిజ్ టీవీకి అందిన నామినేషన్లలో ఉత్తమమైన వాటిని అపార అనుభవం కలిగిన జ్యూరీ సభ్యులు ఎంపిక చేస్తారు. విజేతలకు ఆగస్టు 24న అవార్డులను అందిస్తారు.
Hybiz Food Awards Nomination Link: https://hybiz.tv/hybiz-tv-food-awards-2024-trophy-and-poster-launched-for-3rd-edition/