విజువ‌ల్ సొల్యూష‌న్స్ విభాగంలో లీడింగ్ గ్లోబ‌ల్ ప్రొవైడ‌ర్ గా ఉన్న వ్యూసోనిక్ కార్పొరేషన్.. ఏపీ, తెలంగాణ‌తో పాటు డిజిట‌ల్ స్పేస్ లో బ‌లోపేత‌మ‌వ‌డంపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా విశాల్ పెరిఫెర‌ల్స్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. వ్యూసోనిక్ డిస్ ప్లే బిజినెస్ మ‌రింత ఉన్న‌త స్థాయికి ఎదిగేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. అటు, ఎక్స్ లెన్స్ & క‌స్ట‌మ‌ర్ సెంట్రిక్ విధానం ప‌ట్ల నిబద్ధ‌త‌తో ఉన్న సంస్థ‌గా విశాల్ పెరిఫెర‌ల్స్ గుర్తింపు పొందింది. ఇప్పుడిది ఏపీ, తెలంగాణ‌లో వ్యూసోనిక్ కు సంబంధించిన విభిన్న‌మైన మానిట‌ర్ పోర్ట్ ఫోలియోకు భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించ‌నుంది. వ్యూసోనిక్ మానిటర్లను ఇప్పుడు విశాల్ పెరిఫెరల్స్ రిటైల్ స్టోర్ లో లైవ్ డెమాన్ స్ట్రేష‌న్ కోసం అందుబాటులో ఉంచుతారు. అలాగే వీటిని VishalPeripherals.com వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు.

ఇక‌, ఈ భాగ‌స్వామ్యంపై వ్యూసోనిక్ ఇండియా ఐటీ బిజినెస్ – సేల్స్ & మార్కెటింగ్ డైరెక్ట‌ర్ సంజయ్ భట్టాచార్య స్పందించారు. ” విశాల్ పెరిఫెరల్స్ తో భాగస్వామ్యం అనేది ఏపీ, తెలంగాణ & డిజిటల్ స్పేస్ లో లేటెస్ట్ మానిట‌ర్స్ కోసం వ్యూసోనిక్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ను విస్తరించడానికి, బలోపేతం చేయడానికి మా వ్యూహంలో కీలకమైన దశను సూచిస్తుంది. రాష్ట్ర‌ ఐటీ రంగంలో విశాల్ పెరిఫెర‌ల్స్ ఇప్ప‌టికే త‌న‌దైన ముద్ర వేసుకుంది. గ్రోత్ & ఇన్నోవేష‌న్ కు సంబంధించి వ్యూసోనిక్ విజ‌న్ కు విశాల్ పెరిఫెర‌ల్స్ ప‌ర్ ఫెక్ట్ గా స‌రిపోతుంది ” అని సంజయ్ భట్టాచార్య చెప్పారు.

విజువల్ డిస్‌ప్లే టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న వ్యూసోనిక్ తో భాగ‌స్వామిగా మార‌డంపై విశాల్ పెరిఫెరల్స్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ వికాష్ హిసరియా సంతోషం వ్య‌క్తం చేశారు. వినియోగ‌దారుల అవ‌స‌రాల‌ను తీర్చే విస్తృత శ్రేణి మానిట‌ర్ ల‌ను అందించేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపారు.

Poultary

వ్యూసోనిక్ గురించి:

వ్యూసోనిక్ సంస్థ కాలిఫోర్నియాలో ఏర్పాటైంది. విజువ‌ల్ సొల్యూష‌న్స్ అందించ‌డంలో లీడింగ్ గ్లోబ‌ల్ ప్రొవైడ‌ర్ గా పేరు పొందింది. ప్ర‌పంచ వ్యాప్తంగా వంద‌కు పైగా న‌గ‌రాల్లో కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తోంది. ఈ సంస్థ‌కు సంబంధించిన మరిన్ని వివ‌రాల కోసం www.viewsonic.com వెబ్ సైట్ ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here