విద్యార్థుల Vishal Peripherals
విద్యార్థుల Vishal Peripherals

విద్యార్థులకు అద్భుత అవకాశం..! వారి కోసం అధునాతన సాంకేతికతతో కూడిన ఏఐ & గేమింగ్ జోన్ అందుబాటులోకి వచ్చింది. మ‌న దేశంలోనే ప్రముఖ కంప్యూటర్ స్టోర్ అయిన విశాల్ పెరిఫెరల్స్ దీన్ని ఏర్పాటు చేసింది. ఇందులో స్టూడెంట్స్ కు ఫ్రీ ఎంట్రీ లభిస్తుంది. అలాగే ఏఐ & గేమింగ్ జోన్ లో సదుపాయాలను వాళ్ళు ఉచితంగా వినియోగించుకోవచ్చు. హైదరాబాద్ లో ఇలాంటి ఏఐ & గేమింగ్ జోన్ ఇదే మొట్టమొదటిది కావడం విశేషం. విద్యార్థుల‌కు ఇది ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఏఐ & గేమింగ్ జోన్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం అట్ట‌హాసంగా జ‌రిగింది. విశాల్ పెరిఫెరల్స్ & విశాల్ కంప్యూటెక్ డైరెక్టర్లు వికాష్ హిసరియా, విశాల్ హిసరియా, రాహుల్ మ‌ల్హోత్రా (డైరెక్ట‌ర్ & హెడ్ సిస్ట‌మ్ & కాంపోనెంట్స్ ఇండియా టెక్ ఎకో సిస్ట‌మ్ – ఇంటెల్), అరుణ్ రాఘవన్ (సీనియర్ మేనేజర్ ఛానెల్ డిస్ట్రిబ్యూష‌న్ – ఇంటెల్ ఇండియా) త‌దిత‌రులు ఇందులో పాల్గొన్నారు. సికింద్రాబాద్ పార్క్ లేన్ ఎస్.ఆర్ ఆర్కేడ్ లో ఏఐ & గేమింగ్ జోన్ ను ఏర్పాటు చేశారు.

ఇందులో అత్యాధునిక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కంప్యూటింగ్ టూల్స్ ఉన్నాయి. ప్రోగ్రామింగ్, ఏఐ డెవ‌ల‌ప్ మెంట్ లేదా గేమింగ్.. ఇలా ఏ రంగంలో ఉన్న‌విద్యార్థులైనా త‌మ నైపుణ్యాలను పెంచుకునేందుకు అవి దోహదపడతాయి.

Poultary

ఇందులో స్టూడెంట్స్ కు ఫ్రీగా యాక్సెస్ ల‌భిస్తుంది. వాళ్లు కొత్త విష‌యాలు నేర్చుకునేందుకు ఈ జోన్ ఉప‌యోగ‌ప‌డుతుంది. విద్యార్థుల్లో ప్ర‌యోగాలు చేసే సామ‌ర్థ్యం మెరుగుప‌డేందుకు, సాంకేతిక నైపుణ్యాలు వృద్ధి చెందేందుకు తోడ్పాటు అందిస్తుంది. ఏఐ & గేమింగ్ జోన్ లో ఎంట్రీ అయ్యేందుకు, స్పెష‌ల్ ఆఫ‌ర్ల‌ను పొందేందుకు స్టూడెంట్స్ క‌చ్చితంగా ఐడీ కార్డుల‌ను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్ర‌స్తుత టెక్ యుగంలో విద్యార్థులు విజ‌యాల‌ను సాధించేందుకు ఈ ఏఐ & గేమింగ్ జోన్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. వారికి అవ‌స‌ర‌మైన సాధ‌నా సంప‌త్తిని అందుబాటులో ఉంచుతుంది.

దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల కోసం …. నంబ‌ర్ లో సంప్ర‌దించ‌గ‌ల‌రు.

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here