మేళ్లచెరువు, ఫిబ్ర‌వ‌రి-8-2025: బ‌ల్క్ స‌ప్లైలో మై హోం ఇండ‌స్ట్రీస్ మ‌రో ముంద‌డుగు వేసింది. ఇందుకు ఉప‌యోగ‌ప‌డే భారీ ట్ర‌క్కులు, ట్రైలర్స్ ను అందుబాటులోకి తెచ్చింది. సూర్యాపేట జిల్లా మేళ్ల‌చెరువు శ్రీన‌గ‌ర్ లోని కంపెనీ కొత్త ప్లాంట్ లో వీటిని ప్రారంభించారు. సంస్థ సీనియ‌ర్ ప్రెసిడెంట్ – మార్కెటింగ్ కె. విజ‌య్ వ‌ర్ధ‌న్ రావు ఈ వాహ‌నాల‌ను ఫ్లాగ్ ఆఫ్ చేశారు. 30 ఎం.టి కెపాసిటీ క‌లిగిన వంద 14 వీల్స్ ట్ర‌క్కులు, బ‌ల్క్ 35 ఎం.టి సామ‌ర్థ్య‌మున్న‌ వంద 16 వీల్స్ ట్ర‌క్కులు అందులో ఉన్నాయి. అలాగే బ‌ల్క్ 41 ఎం.టి కెపాసిటీ క‌లిగిన 50 ట్రైల‌ర్స్ ను కూడా ప్రారంభించారు.

మై హోం ఇండ‌స్ట్రీస్ అందించే సేవ‌ల‌ను మ‌రింత మెరుగుప‌ర్చేందుకు.. మార్కెట్ లో ఈ సంస్థ స్థానం బ‌లోపేతమ‌య్యేందుకు ఇవి ఉప‌యోగ‌ప‌డ‌నున్నాయి. వినియోగదారులకు వేగంగా, స‌మ‌యానుకూలంగా స‌ప్లై చేయ‌డంలో కీల‌కంగా మార‌నున్నాయి. మ‌న దేశంలో లాజిస్టిక్ విభాగం శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న త‌రుణంలో.. మౌలిక‌ స‌దుపాయ‌ల క‌ల్ప‌న‌లో మై హోం ఇండ‌స్ట్రీస్ తీసుకున్న ఈ చొర‌వ‌ కీలకంగా మారనుంది.

ఇక‌, దీని మాతృ సంస్థ‌ మై హోం గ్రూప్ హైద‌రాబాద్ ప్ర‌ధాన కేంద్రంగా ప‌ని చేస్తోంది. సిమెంట్, రియ‌ల్ ఎస్టేట్, క‌న్ స్ట్ర‌క్ష‌న్, ప‌వ‌ర్, మీడియా & ఎడ్యుకేష‌న్ సెక్టార్ల‌లో త‌న‌దైన ముద్ర వేసుకుంది. మూడు ద‌శాబ్దాల‌కు పైగా అమూల్య‌మైన సేవ‌ల‌ను అందిస్తూ ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని చూర‌గొంది. ఈ గ్రూప్ వ‌ల్ల ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా 10 వేల మందికి ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ల‌భించాయి. జాతీయ స్థాయిలో వివిధ విభాగాలు, ప్రాంతాల్లో మై హోం గ్రూప్ న‌కు క‌స్ట‌మ‌ర్లు ఉన్నారు. ఉత్ప‌త్తులు, సేవ‌ల్లో నాణ్య‌త‌తో పాటు వ్యాపార ప్ర‌మాణాల‌ను పాటించ‌డంలో క‌చ్చితత్వం ఉండటం వ‌ల్ల మై హోం గ్రూప్ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటోంది. విజ‌న‌రీ, ఫిలాంత్ర‌పిస్ట్ అయిన డాక్ట‌ర్ రామేశ్వ‌ర్ రావు జూప‌ల్లి.. ఈ సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు..! ఆయ‌న దిశా నిర్దేశంలో సంస్థ ముందుకు దూసుకెళ్తోంది. ఇక‌, మై హోం ఇండ‌స్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు జె. రంజిత్ రావు మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న నేతృత్వంలో సంస్థ శ‌ర వేగంగా అభివృద్ధి చెందుతోంది.

Poultary
Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here