ఏపీలో ముగ్గురు ఐపీఎస్ లు, ఆరుగురు ఐఏఎస్ ల బదిలీ
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఉన్నతాధికారులపై బదిలీ వేటు పడింది. ముగ్గురు ఐఏఎస్ లు, ఆరుగురు ఐపీఎస్ లను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ట్రాన్స్ ఫర్ చేసింది. ప్రకాశం, పల్నాడు, అనంతరపురం, నెల్లూరు ఎస్పీలతో పాటు గుంటూరు రేంజ్ ఐజీ ఉన్నారు. అలాగే ఐఏఎస్ లలో కృష్ణా, అనంతపురం, తిరుపతి ఎన్నికల అధికారులు ఉన్నారు. బదిలీ అయిన వారందరినీ ఎలక్షన్ విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం సూచించింది. కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించాలని తెలిపింది.
5 కిలోమీటర్లు.. ఆటో బిల్లు రూ. 3,59,45,507
వైజాగ్ కు చెందిన ప్రసాద్ రావు అనే వ్యక్తికి ఆటో బిల్లు చుక్కలు చూపించింది. 5 కిలోమీటర్ల దూరానికి వందలు కాదు వేలు కాదు ఏకంగా కోట్ల రూపాయల బిల్ రావడంతో ఆయన అవాక్కయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రసాద్ రావు ఓ యాప్ లో ఆటో బుక్ చేసుకున్నారు. ఐదు కిలోమీటర్లు ప్రయాణానికి రూ. 200 అవుతుందని అందులో చూపెట్టింది. దీంతో ప్రసాద్ రావు ఆటో బుక్ చేసుకుని వెళ్లారు. తీరా దిగాక ఆయనకు రూ. 3,59,45,507 కోట్ల బిల్ వచ్చింది. కంగారుపడిన ఆయన.. కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి విషయం తెలియజేశారు. చివరకు టెక్నికల్ ఇష్యూ వల్ల అలా అయిందని.. రూ. 200 చెల్లిస్తే సరిపోతుందని వాళ్లు చెప్పారు. దీంతో ప్రసాద్ రావు ఊపిరి పీల్చుకున్నారు.
భక్తుల ఇంటికే భద్రాచలం తలంబ్రాలు
భద్రాచల సీతారాముల కల్యాణ తలంబ్రాలు భక్తుల ఇంటికే చేరబోతున్నాయి. ఇందుకుగానూ తెలంగాణ ఆర్టీసీ అవసరమైన చర్యలు చేపట్టింది. తలంబ్రాలు కావాల్సిన వాళ్లు ఆర్టీసీ లాజిస్టిక్ సెంటర్స్ లో రూ. 151 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలి. లేదా 040 23450033 నంబర్ కు ఫోన్ చేసి కూడా తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. సీతారాముల కల్యాణ తలంబ్రాల పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు.
పుష్ప-2.. న్యూ అప్ డేట్
బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. మచ్ అవైటెడ్ మూవీ పుష్ప-2 నుంచి లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న పుష్ప-2 టీజర్ రిలీజ్ చేస్తారట. మూవీ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. మరోవైపు, #Pushpa2TheRule, #PushpaMassJaathara, #Pushpa2Teaser వంటి ట్యాగ్ లతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. నిన్నటి వరకు లాభాల్లో కొనసాగిన సూచీలు మంగళవారం లాస్ ను మూటగట్టుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 110 పాయింట్లు నష్టపోయి 73,903కి పడిపోయింది. నిఫ్టీ 8 పాయింట్లు లాస్ అయి 22,453 దగ్గర స్థిరపడింది. ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించేందుకు మొగ్గు చూపడంతో స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాలను చవిచూశాయి.
- పి. వంశీకృష్ణ