30th Mines Environment & Mineral Conservation Week
30th Mines Environment & Mineral Conservation Week

మై హోం ఇండ‌స్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ కు చెందిన‌ శ్రీ జ‌య‌జ్యోతి సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ – ఎస్.జె.సి.పి.ఎల్ 30వ మైన్స్ ఎన్విరాన్ మెంట్ & మిన‌ర‌ల్ క‌న్జ‌ర్వేష‌న్ వీక్ ముగింపు కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా జ‌రిగింది. మైన్స్ ఎన్విరాన్ మెంట్ & మిన‌ర‌ల్ క‌న్జ‌ర్వేష‌న్ కౌన్సిల్ స‌హ‌కారంతో ప్రోగ్రాంను నిర్వ‌హించారు. శంషాబాద్ లోని మ‌ల్లిక క‌న్వెన్ష‌న్ హాల్ వేదిక‌గా ఈవెంట్ ను చేప‌ట్టారు. పి.ఎన్ శ‌ర్మ (కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ – ఇన్ ఛార్జ్, ఇండియ‌న్ బ్యూరో ఆఫ్ మైన్స్, నాగ్ పూర్) దీనికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

జ‌య‌కృష్ణ బాబు (కంట్రోల‌ర్ ఆఫ్ మైన్స్ (ఎస్.జెడ్), ఇండియ‌న్ బ్యూరో ఆఫ్ మైన్స్, బెంగళూరు), వి.ఎస్ నారంగ్ (డైరెక్ట‌ర్ -టెక్నిక‌ల్, మై హోం ఇండ‌స్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్), చంద్ర‌శేఖ‌ర్ పాండే (డైరెక్టర్ – ఆప‌రేష‌న్స్, మై హోం ఇండ‌స్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్), బి.సి గురివి రెడ్డి (ఛైర్మ‌న్ ఎంఈ & ఎంసీ 2024-25 & సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ – వ‌ర్క్స్, ఎస్.జె.సి.పి.ఎల్) ఇందులో పాల్గొన్నారు. వీరితో పాటు ఇ. వాసుదేవ‌న్ (క‌న్వీన‌ర్ ఎంఈ & ఎంసీ 2024-25, జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ – మైన్స్, ఎస్.జె.సి.పి.ఎల్), ద‌ర్శ‌న్ దీప్ భ‌ర‌ద్వాజ్ (కో-పాట్ర‌న్ ఎంఈ & ఎంసీ 2024-25, డీసీఓఎం (ఐ/సి), విజ‌య‌వాడ రీజియ‌న్), రామ్ కిష‌న్ (పాట్ర‌న్ ఎంఈ & ఎంసీ 2024-25, డీసీఓఎం (ఐ/సి), హైద‌రాబాద్ రీజియ‌న్) త‌దిత‌రులు పాల్గొన్నారు.

కార్య‌క్ర‌మంలో భాగంగా ప‌ర్యావ‌ర‌ణానికి సంబంధించిన ప్ర‌తిజ్ఞ చేశారు. ప‌లు స్టాల్స్ ను ప్ర‌ద‌ర్శించారు. అనంత‌రం ప్ర‌ముఖులు ప్ర‌సంగించారు. ఎస్.జె.సి.పి.ఎల్ అందిస్తున్న సేవ‌ల‌ను వివ‌రించారు. ఆ త‌ర్వాత వివిధ కేట‌గిరీల్లో బ‌హుమ‌తుల ప్ర‌దానోత్స‌వం జ‌రిగింది. వివిధ ర‌కాల సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు వీక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

Poultary
Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here