ఎఫ్.ఎ.బి.ఎ
ఎఫ్.ఎ.బి.ఎ

ద ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఏషియ‌న్ బ‌యోటెక్ అసోసియేష‌న్స్ (ఎఫ్.ఎ.బి.ఎ), యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ సంయుక్తంగా ఇన్నోవేష‌న్ స‌మ్మిట్ ను నిర్వ‌హిస్తున్నాయి. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ఈ స‌దస్సుకు స‌హ‌కారాన్ని అందిస్తోంది. బ‌యోటెక్నాల‌జీ రంగంలో నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లను తెలియ‌జేసేందుకు.. ఇండ‌స్ట్రీ, విద్యా సంస్థ‌ల మ‌ధ్య భాగ‌స్వామ్యాన్ని పెంపొందించేదుకు ఇన్నోవేష‌న్ స‌మ్మిట్ దోహ‌ద‌ప‌డుతుంది.

ఈ స‌ద‌స్సుకు సంబంధించిన వివ‌రాల‌ను తెలియ‌జేసేందుకు హైద‌రాబాద్ సోమాజిగూడ‌లో మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రొఫెస‌ర్ పి. రెడ్డ‌న్న (ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ – ఎఫ్.ఎ.బి.ఎ), చ‌క్ర‌వ‌ర్తి ఎవీపీఎస్ (ఛైర్మ‌న్ – ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఫార్మా ఆంట్రాప్రెన్యూర్స్, టీజీ & ఏపీ, అడ్వయిజ‌ర్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎఫైర్స్ ఎఫ్.ఎ.బి.ఎ), ప్రొఫెసర్ సామ్రాట్ ఎల్ సబత్, ప్రొ. ఎ. బిందు మాధ‌వ‌రెడ్డి (ప్రొఫెస‌ర్ – యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్) ఇందులో పాల్గొన్నారు. వారితోపాటు డాక్ట‌ర్ ర‌త్నాక‌ర్ పాలకొడేటి (సెక్రెట‌రీ జ‌న‌ర‌ల్, ఎఫ్‌.ఎ.బి.ఎ), డాక్ట‌ర్ జ‌గ‌దీశ్ గండ్ల (సీఓఓ – ఎఫ్.ఎ.బి.ఎ) త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

ఇన్నోవేష‌న్ స‌మ్మిట్ లో ప్ర‌ధానంగా మూడు ఈవెంట్లు నిర్వ‌హిస్తున్నారు. ఆగ‌స్టు 16వ తేదీ వ‌ర‌కు డ్ర‌గ్ డిస్క‌వ‌రీ & డెవ‌ల‌ప్ మెంట్ వ‌ర్క్ షాప్, 17న వేల్ ట్యాంక్ 2.O, 18న లైఫ్ సైన్సెస్ ఇన్నోవేష‌న్ క్ల‌స్ట‌ర్ మీట్ ఉంటాయి. డ్ర‌గ్ డిస్క‌వ‌రీ & డెవ‌ల‌ప్ మెంట్ ప్రాసెస్ లో మ‌రిన్ని లోతైన విష‌యాలు తెలుసుకునేందు, ఇన్నోవేటివ్ రీసెర్చ్ & డెవ‌ల‌ప్ మెంట్ లో అవ‌కాశాలను అందిపుచ్చుకునేందుకు, లైఫ్ సైన్సెస్ రంగంలో లేటెస్ట్ అప్ డేట్స్ పై అవ‌గాహ‌న పెంపొందించుకునేందుకు ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

Poultary

వీటితో పాటు విజ‌న‌రీ కీ నోట్స్, ఇంట‌రాక్టివ్ వ‌ర్క్ షాప్, ఎక్స్ క్లూజివ్ నెట్ వ‌ర్కింగ్, ఫోక‌స్డ్ ప్యాన‌ల్ డిస్క‌ష‌న్స్ కూడా నిర్వ‌హిస్తారు. ల‌ర్న్, క‌నెక్ట్, షేప్.. ఈ మూడింటికీ ఇన్నోవేష‌న్ స‌మ్మిట్ తోడ్ప‌డుతుంది. ఈ కార్య‌క్ర‌మాల‌తో పాటు ప‌లువురికి అవార్డుల‌ను కూడా అంద‌జేయ‌నున్నారు.

ఎఫ్.ఎ.బి.ఎ గురించి..:


ఎఫ్.ఎ.బి.ఎ అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గ‌నైజేష‌న్. ప్ర‌పంచ వ్యాప్తంగా బ‌యోటెక్నాల‌జీ రంగాన్ని ప్ర‌మోట్ చేసేందుకు కృషి చేస్తోంది. ఎఫ్.ఎ.బి.ఎ గురించి మ‌రిన్ని వివ‌రాల కోసం www.biofaba.org.in వెబ్ సైట్ లో సంప్ర‌దించ‌గ‌ల‌రు

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here