ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కనీసం ఒక పాలియాటీవ్ కేర్ సెంటర్ ప్రారంభించేలా కృషి చేస్తానని రాష్ట్ర  ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. నగరంలోని కాజాగూడ వేదికగా స్పర్శ్ హాస్పీస్, పాలియాటీవ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ హాస్పీస్ అండ్ పాలియాటీవ్ డే కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ., తృప్తి, ధైర్యం, సాంత్వన, కోరిక, ఆశ అనే తపనతో గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు చేస్తాం. కానీ అసలైన దేవాలయం, అసలైన సేవ ఈ స్పర్శ్ లాంటి వేదికల్లో లభిస్తుందని తెలిపారు. మన పూర్వీకులు తెలిపిన మానవసేవే మాధవ సేవ అని నానుడికి పర్యాయపదం  ఈ స్పర్శ్ సంస్ధ అని అన్నారు. ఇక్కడ సేవలు చూసి  భావోద్వేగానికి లోనయ్యానని, అంకితభావంతో ఇక్కడ చేసే సేవలు ఆశ్చర్యాన్ని గురిచేసాయని పేర్కొన్నారు.

ఇక్కడ అవస్థలతో కూడిన పేషంట్ల బావోద్వేగాలను సమన్వయ పరుస్తున్న తీరు, కౌన్సిలింగ్ వ్యవస్థ, అంకితభావంతో చేస్తున్న స్వచ్ఛమైన సేవ తన మనస్సును హత్తుకున్నాయని వెల్లడించారు. ఇలాంటి సెంటర్లను ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా ప్రారంభించే ప్రయత్నాలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు.

Poultary

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం ఒకటైన ఏర్పాటు చేయడం పాలసీగా ముందుకు తీసుకువెళతామన్నారు.  కేన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది,  ఈ సంఖ్యకు అనుకూలంగా ప్రభుత్వం ఆరోగ్య శాఖ నుంచి అదే స్థాయిలో స్పందన ఉంటుందని పేర్కొన్నారు .  

అంతిమ దశలో స్వాంతన అందించే ఇలాంటి సంస్థలకు ప్రభుత్వం తరపున ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా పాలియాటీవ్ కేర్ సేవలను కూడా ఆరోగ్య శ్రీ లో చేర్చాలని స్పర్శ్ ప్రతినిధులు కోరగా, దీనిని కార్య రూపం దాల్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం స్పర్శ్ హస్పీస్ ట్రస్టీ సభ్యులు డా. సుబ్రమణ్యం మాట్లాడుతూ… ఈ సంస్థను 2011లో ప్రారభించి ఉచితంగా పాలియాటీవ్ సేవలు అందించడమే కాకుండా దీని పైన అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈ మధ్యకాలంలో పాలియాటీవ్ కేర్ గురించి విరివిగా వింటున్నాం, దీనికోసం 13 ఏళ్లుగా వివిధ వేదికల్లో అవగాహన కల్పిస్తూ కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తమ సేవలను గుర్తించి గతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో సంస్థ సొంత భవనం నిర్మించుకుని సేవలు అందిస్తున్నామని, ఈ ఉచిత సేవలకై ప్రతి నెల దాదాపు 50 లక్షలు ఖర్చు పెడుతున్నామని, ప్రతి రూపాయి దాతలు నుంచి సేకరించి ఖర్చు చేస్తున్నామని అన్నారు.

ఈ పాలేటివ్ కేస్ కేవలం 1% మాత్రమే ఉపయోగిస్తున్నారని ఈ సంఖ్య పెరిగాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. స్పర్శ్ సేవలకు నెలకు 500 అంతకన్నా ఎక్కువ విరాళం అందించేలా గార్డియన్ ఆఫ్ స్పర్శ్ పేరిట నూతన కార్యక్రమం ఏర్పాటు చేశామని, అందరూ దీనికి సహాకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ కారుణ్య, ప్రముఖ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డా. చిన బాబు, రోటరీ క్లబ్ సభ్యులు, స్పర్శ్ సేవలు పొందిన పేషెంట్ల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here