మానసిక ఆరోగ్యాన్ని విస్మరించలేము, ఇది మన సమాజ శ్రేయస్సుకు చాలా ముఖ్యమైనది. మానసిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్న వారిలో 75% మంది సహాయం కోరరు. ఈ అంతరాన్ని తగ్గించడానికి, సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, మానసిక ఆరోగ్యానికి one-stop solution అయిన Amrutha Sankalp ను ఈరోజు మాధపూర్లో శ్రీ కె.టి. రామారావు ప్రారంభించారు.
“మానసిక ఆరోగ్య కేంద్రం అంటే కేవలం అనారోగ్యానికి చికిత్స మాత్రమే కాదు, దానిని wellness కోణంలో కూడా చూడాలి. డాక్టర్ సురేంద్ర ఈ దిశగా అడుగులు వేయడం ప్రశంసనీయం.” అని కేటీఆర్ అన్నారు.


అనారోగ్యానికి చికిత్స చేయడమే కాకుండా మానసిక వికాసానికి దోహదపడే ఈ సమగ్ర విధానాన్ని ఆయన ప్రశంసించారు. మానసిక ఆరోగ్య సమస్యల చికిత్స కోసం ముందుకు రండి, వెనుకాడకండి, సహాయం కోరడంలో తప్పు లేదు, అని ఆయన నొక్కి చెప్పారు.
ప్రముఖ శిశు వైద్య నిపుణుడు డాక్టర్ జి. సురేంద్ర స్థాపించిన ఈ క్లినిక్ పిల్లలు, పెద్దలు మరియు వృద్ధులకు క్రమబద్ధమైన సంరక్షణను అందిస్తుంది. ఒత్తిడి, ఆందోళన, నిరాశ, Relationship issues, OCD, addiction మరియు మరింత తీవ్రమైన సమస్యలకు ఈ క్లినిక్‌లో చికిత్స చేయబడుతుంది.
శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం అని, మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడంలో నా వంతు ప్రయత్నమే, ఈ Amrutha Sankalp clinic అని డాక్టర్ జి. సురేంద్ర అన్నారు.
360° model of care Amrutha Sanlakp యొక్క ప్రత్యేకత. Technology company, avika సహకారంతో, ఈ క్లినిక్ వర్చువల్ రియాలిటీ (VR) చికిత్స, టెలిథెరపీ, mobile app మరియు నిపుణులచే రూపొందించబడిన కస్టమైజ్డ్ థెరపీ ప్లాన్లను అందిస్తుంది.
Amrutha Sankalp లో వ్యక్తిగత చికిత్సకే పరిమితం కాకుండా, కార్పొరేట్ మరియు విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. ఈ కార్యక్రమాలు అవగాహనను పెంచడంలో సహాయపడతాయి. Avika team సహకారంతో Antharanga అనే అనుభవపూర్వక వర్క్‌షాప్‌లు కూడా ఇక్కడ నిర్వహిస్తారు.
అవికా సహ వ్యవస్థాపకురాలు & CEO అయిన శిరీష మాట్లాడుతూ, “మంచి ప్రమాణాలతో, అందరికీ అందుబాటులో ఉండేలా therapy protocols ను రూపొందించడం సాధ్యమే అని, అది టెక్నాలజీ ద్వారా చేయడమే అవికా లక్ష్యం” అని అన్నారు. “India లో మానసిక ఆరోగ్య సంరక్షణను re-imagine చేసే ఈ ప్రయాణంలో డాక్టర్ సురేంద్రతో కలిసి పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది..” అని అన్నారు
Amrutha Sankalp కేవలం ఒక క్లినిక్ మాత్రమే కాదు, మానసిక ఆరోగ్య సమస్యను అర్థం చేసుకోవడానికి, పరిష్కరించడానికి, ఇది ఒక ఉద్యమం. సమగ్ర విధానాన్ని ఉపయోగించడం ద్వారా, ఈ క్లినిక్, కళంకాన్ని, చికిత్సలో అంతరాన్ని తగ్గించడానికి కృషి చేస్తుంది.