ప్రీమియం డైమండ్ బ్రాండ్ “ఎలివ్ డైమండ్స్” హైదరాబాద్‌లో తన మొట్టమొదటి ఫ్లాగ్షిప్ షోరూం ప్రారంభించింది. తిబరుమల్ జ్యువెల్స్ పర్యవేక్షణలో రూపొందిన ఈ బ్రాండ్, లగ్జరీకు కొత్త నిర్వచనాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రారంభోత్సవానికి మిస్ యూనివర్స్ తెలంగాణ 2025 మిస్ కశ్వి మరియు Mrs. ఇండియా 2024 విజేత డాక్టర్ ప్రీతి అడుసుమిల్లి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బ్రాండ్ ప్రతినిధులు పంకజ్ గుప్తా, త్రిశాంక్ గుప్తా మరియు అభిరామ్ అగర్వాల్ ఈవెంట్లో మీడియాతో మాట్లాడుతూ, సంస్థ లక్ష్యం — “ఎథికల్ లగ్జరీని అందరికీ అందించటం” అని వెల్లడించారు.
చార్మినార్ కలెక్షన్‌తో సంచలనం

ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా చార్మినార్ కలెక్షన్ ను ఆవిష్కరించారు. ఈ కలెక్షన్‌ను ప్రముఖ డిజైనర్ పంకజ్ గుప్తా రూపొందించారు. హైదరాబాద్ చారిత్రక వారసత్వానికి అద్దం పడేలా, ప్రతి ఆభరణాన్ని హస్తకళతో ప్రత్యేకంగా తయారు చేశారు.
ఎలివ్ డైమండ్స్ స్పష్టంగా తెలిపింది – “మాస్ ప్రొడక్షన్ కాదు, ప్రతి ఆభరణం ప్రత్యేకమే. నాణ్యతతో పాటు సౌందర్యాన్ని మిళితం చేస్తూ తయారు చేస్తాము.”
ఎలివ్ డైమండ్స్ ప్రత్యేకతలు
- 100% అసలైన ల్యాబ్ గ్రోన్ డైమండ్స్
- IGI సర్టిఫైడ్, పర్యావరణ హితంగా ఉత్పత్తి చేయబడినవి
- నిత్య వినియోగానికి అనువైన, తేలికపాటి డిజైన్లు
- లాభాల్లో కొంత భాగం బేటీ బచావో – బేటీ పడావో మరియు హస్తకారుల సంక్షేమానికి కేటాయింపు
విస్తరణ ప్రణాళికలు
“ఎలివ్ డైమండ్స్” భవిష్యత్‌లో బంజారాహిల్స్, కోంపల్లీ, వరంగల్, కోయంబత్తూర్, అలాగే యునైటెడ్ స్టేట్స్ వంటి ప్రదేశాల్లో షోరూమ్‌లను ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.













