M.Raj Gopal,Rajshekar Reddy,Minister Uttam Kumar,Dr Vakulabharanam Krishna Mohan Rao,Srinubabu Gedela,Ravinder Reddy

మీడియా రంగంలో మ‌రో అద్భుత ఘ‌ట్టం ఆవిష్కృత‌మైంది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిట‌ల్ విభాగాల్లో… జర్నలిజం, అడ్వ‌ర్టైజ్ మెంట్, కేట‌గిరీల్లో విశేష సేవ‌లు అందిస్తున్న వారికి స‌ముచిత గౌర‌వం ద‌క్కింది. ఆయా రంగాల్లో రాణిస్తున్న‌ సిబ్బందిని హై బిజ్ టీవీ ఘ‌నంగా స‌త్క‌రించింది. హై బిజ్ టీవీ మీడియా అవార్డ్స్ (హెచ్.ఎం.ఎ) 4వ‌ ఎడిష‌న్ సంద‌ర్భంగా పుర‌స్కారాల‌ను అంద‌జేసింది.

హైద‌రాబాద్ హెచ్.ఐ.సి.సి నోవాటెల్ వేదిక‌గా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి (ఇరిగేష‌న్, ఫుడ్ & సివిల్ స‌ప్లైస్) ముఖ్యఅతిథిగా హాజ‌రై విజేతలకు అవార్డుల‌ను అందజేశారు. బీసీ క‌మిష‌న్ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, ఎం. ర‌వీంద‌ర్ రెడ్డి (డైరెక్ట‌ర్ మార్కెటింగ్ – భార‌తి సిమెంట్), వి.రాజ‌శేఖ‌ర్ రెడ్డి (ప్రెసిడెంట్ – క్రెడాయ్ హైద‌రాబాద్), ప‌ల్స‌స్ గ్రూప్ సీఈవో గేదెల శ్రీను బాబు, మానేపల్లి జ్యువెల్ల‌ర్స్ అధినేత మానేప‌ల్లి రామారావు, మీడియా రంగ ప్ర‌ముఖులు ఐ. వెంక‌ట్, కేఆర్ పీ రెడ్డి, హై బిజ్ టీవీ & తెలుగు నౌ ఫౌండ‌ర్, ఎండీ ఎం. రాజ్ గోపాల్, హై బిజ్ టీవీ & తెలుగు నౌ సీఈవో డాక్ట‌ర్ జె. సంధ్యారాణి త‌దిత‌రులు ఇందులో పాల్గొన్నారు.

భార‌త ప్ర‌జాస్వామ్యానికి మీడియా రంగం మూలస్తంభం లాంటిద‌ని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తెలిపారు. డెమోక్ర‌సీలో మీడియాది కీల‌క‌పాత్ర అని చెప్పారు. అలాంటి ఈ రంగానికి ప్ర‌భుత్వం త‌ర‌ఫున స‌హ‌క‌రాన్ని అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. హై బిజ్ మీడియా అవార్డ్స్ లో భాగంగా ప్రింట్, ఎల‌క్ట్రానిక్, డిజిట‌ల్ రంగాల్లో పుర‌స్కారాలు అందుకున్న సిబ్బందికి ఆయ‌న అభినంద‌న‌లు తెలిపారు. ఇలాంటి గొప్ప కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన హై బిజ్ టీవీ యాజ‌మాన్యాన్ని అభినందించారు.

Poultary

హెచ్.ఎం.ఎ 4వ‌ ఎడిష‌న్ లో భాగంగా ఐదుగురిని లెజెండ్ పుర‌స్కారాల‌తో స‌త్క‌రించారు. 2 టీమ్ అవార్డ్స్ తో పాటు ముగ్గురికి విజ‌న‌రీ అవార్డ్స్ అంద‌జేశారు. వీటితో పాటుగా ప్రింట్ జ‌ర్న‌లిజం (ఇంగ్లీష్, తెలుగు & ఇత‌ర భాష‌లు), ప్రింట్ అడ్వ‌ర్టైజ్ మెంట్ (ఇంగ్లీష్, తెలుగు & ఇత‌ర భాష‌లు) కేట‌గిరీల్లో విజేత‌ల‌కు పుర‌స్కారాల‌ను ఇచ్చారు. అలాగే ఎల‌క్ట్రానిక్ జ‌ర్న‌లిజం, ఎల‌క్ట్రానిక్ అడ్వ‌ర్టైజ్ మెంట్, డిజిట‌ల్ మీడియా విభాగాల సిబ్బంది అవార్డుల‌ను స్వీక‌రించారు. వివిధ ప‌బ్లికేష‌న్లు, ఛాన‌ళ్లలో ప‌ని చేస్తున్న యాంక‌ర్లు, రిపోర్ట‌ర్లు, ఫొటోగ్రాఫ‌ర్లు, వీడియో జ‌ర్న‌లిస్టులు, డిజిట‌ల్ టీమ్ మెంబ‌ర్స్ వారిలో ఉన్నారు. మొత్తం 70 మందికి పైగా ఈ పుర‌స్కారాల‌ను అందుకున్నారు.

మీడియా దిగ్గ‌జాల‌కు ఘ‌న నివాళి:

దివికేగిన మీడియా దిగ్గ‌జాలు.. ఈనాడు గ్రూప్ సంస్థ‌ల ఛైర్మ‌న్ రామోజీరావు, సియాస‌త్ మేనేజింగ్ ఎడిట‌ర్ జ‌హీరుద్దీన్ అలీఖాన్, డెయిలీ హిందీ మిలాప్ ఎడిట‌ర్ విన‌య్ వీర్ కు హై బిజ్ మీడియా అవార్డ్స్ లో భాగంగా ఘ‌న నివాళుల‌ర్పించారు. మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, ఇత‌ర మీడియా రంగ ప్ర‌ముఖులు వారికి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. పాత్రికేయ‌ రంగానికి రామోజీరావు, జుబేర్ అలీ ఖాన్, విన‌య్ వీర్ చేసిన సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు.

హై బిజ్ టీవీ గురించి:

ఆన్ లైన్ బిజినెస్ న్యూస్ ఛానల్స్ విభాగంలో హై బిజ్ టీవీ ముందంజ‌లో ఉంది. దేశంలో ఎక్కువ మంది వీక్షించే ఛాన‌ల్స్ లో ఒక‌టిగా పేరు తెచ్చుకుంది. ప్ర‌తి నిత్యం 1 మిలియ‌న్ వ్యూస్ హై బిజ్ టీవీ సొంతం. యూ ట్యూబ్ లో దాదాపు 7 ల‌క్ష‌ల మంది స‌బ్ స్క్రైబ‌ర్స్ ఈ ఛాన‌ల్ కు ఉన్నారు. గ‌త 15 ఏళ్లుగా వీక్ష‌కుల‌కు దాదాపు ల‌క్ష వ‌ర‌కు బిజినెస్ వీడియోల‌ను అందిస్తూ వ‌స్తోంది.

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here