రూ. 245 కోట్లకు ఇంటిని అమ్మిన జూకర్ బర్గ్

జూకర్ బర్గ్ ఇల్లు:

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్ బర్గ్ … శాన్ ఫ్రాన్సిస్కోలోని తన ఖరీదైన ఇంటిని విక్రయించారు. 31 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 245 కోట్లు) దాన్ని అమ్మేశారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ సంవత్సరం జరిగిన గృహ విక్రయాల్లో ఇదే అత్యంత భారీ డీల్ అవ్వడం విశేషం. జూకర్ బర్గ్ సంపద ఈ ఏడాది గణనీయంగా తగ్గిపోయిన నేపథ్యంలో ఇంటిని విక్రయించడం చర్చనీయాంశంగా మారింది.

లిబర్టీ హిల్ ప్రాంతంలో ఉన్న ఆ గృహాన్ని 2012లో జూకర్ బర్గ్ కొనుగోలు చేశారు. అప్పుడు దాని విలువ 10 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 79 కోట్లు). 1928లో దాదాపు 7000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అది నిర్మితమైంది. స్టాక్ ఎక్సేంజ్ లో ఫేస్ బుక్ ను నమోదు చేసిన తర్వాత జూకర్ దాన్ని కొన్నారు.

2013లో భార్య ప్రిసిల్లా ఛాన్ తో కలిసి ఆ ఇంట్లో కొన్ని మార్పులు చేశారు. అప్పుడు దాదాపు లక్ష డాలర్లు వెచ్చించారు. లాండ్రీ రూం, వైన్ రూం, వెట్ బార్, గ్రీన్ హౌస్ వంటివి ఏర్పాటు చేసుకున్నారు. కాగా ఆ ఇంటి నిర్మాణం, అక్రమంగా వాహనాలను పార్కింగ్ చేయడంపై … చుట్టు పక్కల వారి నుంచి జూకర్ బర్గ్ కు కొన్నేళ్లుగా ఫిర్యాదులు అందుతున్నాయి. అందుకే దాన్ని విక్రయించారని భావిస్తున్నారు.

Poultary

ప్రపంచ కుబేరుల జాబితాలో జూకర్ బర్గ్ 17వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద విలువ 61.9 బిలియన్ డాలర్లు. లేక్ టేహో, హవాయ్, సిలికాన్ వ్యాలీలో కూడా జూకర్ బర్గ్ కు విలాసవంతమైన నివాసాలు ఉన్నాయి.

 

ALSO READ: జూలై 28 నుంచి కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here