Union Public Service Commission నిర్వహించిన సివిల్ సర్వీసెస్ – 2023 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 1,016 మంది ఎంపికయ్యారు.(UPSC Civil Services Result) అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. మంగళవారం ఆ రిజల్ట్స్ ను రిలీజ్ చేసింది.
ఫలితాల్లో ఆదిత్య శ్రీవాత్సవ ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. అనిమేశ్ ప్రదాన్ రెండో ర్యాంకు సొంతం చేసుకున్నారు. తెలంగాణలోని పాలమూరుకు చెందిన దోనూరి అనన్య రెడ్డికి మూడో ర్యాంకు దక్కింది.(UPSC Civil Services Mains Result) పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్ నాలుగో ర్యాంకు, రుహానీ ఐదో ర్యాంకు సాధించారు.
ఏ కేటగిరీలో ఎంత మంది?
జనరల్ కేటగిరీలో 347 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈడబ్ల్యూఎస్ విభాగంలో 115 మంది, ఎస్సీ కేటగిరీలో 165 మంది, ఓబీసీ నుంచి 303 మంది అర్హత సాధించారు. ఎస్టీ కేటగిరీలో 86 మందిని సెలెక్ట్ చేశారు.
180 మంది క్యాండిడేట్లు IAS పోస్టులకు ఎంపికయ్యారు. 200 మంది ఐపీఎస్ లు కాబోతున్నారు. 37 మంది ఐఎఫ్ఎస్ విభాగంలో అర్హత సాధించారు. ఇక, 613 మంది అభ్యర్థులు సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్-ఏకు, 113 మంది గ్రూప్-బీ సర్వీసులకు ఎంపికయ్యారు. upsc.gov.in. వెబ్ సైట్ ద్వారా ఈ ఫలితాలు తెలుసుకోవచ్చు.
టాప్-10 ర్యాంకర్లు వీళ్లే:
1. ఆదిత్య శ్రీవాత్సవ
2. అనిమేశ్ ప్రధాన్
3. దోనూరు అనన్యా రెడ్డి
4. సిద్ధార్థ్ రామ్ కుమార్
5. రుహాని
6. శ్రిష్టి దబాస్
7. అన్ మోల్ రాథోర్
8. ఆశిష్ కుమార్
9. నౌషీన్
10. ఐశ్వర్యం ప్రజాపతి
యూపీఎస్సీ ప్రతి ఏటా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ ఇలా మూడు దశల్లో పరీక్ష జరుగుతుంది. Indian Administrative Service, Indian Foreign Service and Indian Police Service సహా ఇతర విభాగాల్లో చేరేందుకు ఇది ఉపయోగపడుతుంది.
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉన్న 1,105 పోస్టుల భర్తీ కోసం గతేడాది యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. దీనికి సంబంధించి 2023 మేలో ప్రిలిమ్స్ నిర్వహించారు. సెప్టెంబర్ లో మెయిన్స్ పరీక్ష జరిగింది. డిసెంబర్ లో వాటి ఫలితాలు వెలువడ్డాయి. ఎంపికైన అభ్యర్థులకు వివిధ దశల్లో పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఫైనల్ రిజల్ట్స్ మంగళవారం రిలీజ్ అయ్యాయి.
- పి. వంశీకృష్ణ