Today News Roundup.. నేటి ప్రధానాంశాలు
Driving License: డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సులభతరం చేసింది. దీని ప్రకారం… లైసెన్స్ కోసం ఇకపై ఆర్టీవో ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు.
ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ లో ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చు. ఈ మేరకు జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఇక నుంచి ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్ స్టిట్యూట్స్ టెస్టులను నిర్వహించి సర్టిఫికెట్ జారీ చేస్తాయి. దాని ఆధారంగా దరఖాస్తు చేసుకుని డ్రైవింగ్ లైసెన్స్ సులభంగా పొందవచ్చు.
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు సృష్టించాయి. గురువారం భారీ లాభాలను చవిచూశాయి. ఉదయం 74,253 పాయింట్ల దగ్గర ప్రారంభమైన సెన్సెక్స్ తర్వాత జోరందుకుంది.
1196 పాయింట్ల లాభంతో 75,418 దగ్గర ముగిసింది. నిఫ్టీ 369 పాయింట్లు లాభపడి 22,967 పాయింట్ల దగ్గర క్లోజయింది. సెన్సెక్స్ లో సన్ ఫార్మా, ఎన్టీపీసీ తదితర షేర్లన్నీ లాభపడ్డాయి.
UK General Election: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కీలక ప్రకటన చేశారు. UK General Electionsపై జరుగుతున్న ప్రచారానికి ముగింపు పలికారు. జూన్ 4న ఆ దేశంలో ముందస్తు సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తామని సునాక్ ప్రకటించారు.
ఇందుకు అనుగుణంగా త్వరలోనే పార్లమెంట్ ను రద్దు చేస్తామని స్పష్టం చేశారు.
Ricky Ponting: ఇండియన్ క్రికెట్ టీంహెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం జూన్ తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ కోసం బీసీసీఐ వేట మొదలుపెట్టింది.
పలువురి పేర్లను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ ను బీసీసీఐ సంప్రదించినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే పాంటింగ్ భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా సేవలందిస్తారు.
Anand Mahindra: ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD దర్శకుడు నాగ్ అశ్విన్ పై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ప్రశంసలు కురిపించారు. ఆయన లాంటి డైరెక్టర్ ను చూడటం గర్వకారణంగా ఉందని అన్నారు.
కల్కి మూవీలో వాడిన వాహనాల డిజైనింగ్ లో చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ బృందం సహాయపడిందని ఆనంద్ మహీంద్ర తెలిపారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.














