వాటర్ ఫాల్ రాపెల్లింగ్ వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వనున్న తెలంగాణ

వాటర్ ఫాల్ రాపెల్లింగ్ వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వనున్న తెలంగాణ

మరో అంతర్జాతీయ ఈవెంట్ కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. వాటర్ ఫాల్ రాపెల్లింగ్ 3వ వరల్డ్ కప్ కు వేదిక కానుంది. మన రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఉన్న గాయత్రి జలపాతంలో ఈ పోటీలను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ఇవి జరగనున్నాయి. వాటర్ ఫాల్ రాపెల్లింగ్ వరల్డ్ కప్ ఆర్గనైజింగ్ కమిటీ(డబ్ల్యు.ఆర్.డబ్ల్యు.సి.ఒ.సి) ఈ వివరాలను వెల్లడించింది.

2019, 2020లో వాటర్ ఫాల్ రాపెల్లింగ్ వరల్డ్ కప్ ను అరకు సమీపంలో నిర్వహించారు. కొవిడ్ కారణంగా గత ఏడాది విరామాన్నిచ్చారు. ఈ సారి మళ్ళీ అవి జరగనున్నాయి. రాపెల్లింగ్ అనేది ఒక సాహస క్రీడ. పోటీదారులు … పై నుంచి కిందకి జాలువారే జలధారల్లో రాపెల్లింగ్ చేయాల్సి ఉంటుంది. తాడు సాయంతో స్ట్రెయిట్ పాయింట్ నుంచి ఫినిషింగ్ పాయింట్ కు చేరాలి. అడ్వెంచర్ టూరిజంలో భాగంగా చాలా దేశాలు ఇలాంటి పోటీలను నిర్వహిస్తున్నాయి.

రాపెల్లింగ్ కు గాయత్రి జలపాతం ఎంతో అనుకూలమైన ప్రదేశం. దీని ఎత్తు 330 ఫీట్లు. నార్మల్, రివర్స్, బ్లైండ్ ఫోల్డ్, బ్లైండ్ ఫోల్డ్ రివర్స్, వర్టికల్ క్లైంబింగ్ తదితర విన్యాసాలను ఇక్కడ చేసే వీలుంది.

Poultary

సెప్టెంబర్ చివరి వారంలో మొదలయ్యే రాపెల్లింగ్ వరల్డ్ కప్ లో రెండు విభాగాల్లో పోటీలు ఉంటాయని డబ్ల్యు.ఆర్.డబ్ల్యు.సి.ఒ.సి తెలిపింది. సీనియర్ విభాగంలో( 17 నుంచి 50 ఏళ్లు) మహిళలు, పురుషులకు కాంపిటీషన్ నిర్వహిస్తామని వెల్లడించింది. వెటరన్ కేటగిరీలో 50 నుంచి 70 ఏళ్ల పురుషులు, మహిళలు పాల్గొంటారని వివరించింది. రాపెల్లింగ్ చేసే ఒక్కో బృందంలో గరిష్టంగా ఆరుగురు సభ్యులు ఉండాలని సూచించింది.

ఈ సారి జరిగే వరల్డ్ కప్ లో 30కి పైగా దేశాల నుంచి పోటీదారులు పాల్గొనే అవకాశం ఉందని డబ్ల్యు.ఆర్.డబ్ల్యు.సి.ఒ.సి తెలిపింది. ప్రతీ విభాగంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లకు మెడల్స్, సర్టిఫికెట్స్ తో పాటు నగదు బహుమతి ఇస్తామని వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం, పర్యాటక శాఖ, ఐ.టి.డి.ఎ … ఈ కార్యక్రమానికి సహకారాన్ని అందిస్తున్నాయి పేర్కొంది. అడ్వెంచర్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.

 

ALSO READ: జూలై 28 నుంచి కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here