క్రికెట్ లవర్స్.. మీరు ఈ గేమ్ లో చాలా రూల్స్ చూసుంటారు. Technologyకి అనుగుణంగా రూల్స్ కూడా Update అవుతున్నాయి. Duckworth Lewis Rule లాంటివి అందులో చాలానే ఉన్నాయి. వాటికి మరొకటి యాడ్ కాబోతోంది. అదే Stop Clock Rule. అసలు ఇదేంటి? ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది? దీనివల్ల లాభమా.. నష్టమా? ఇలాంటి ఫుల్ డీటెయిల్స్ మీ కోసం.
ఎప్పటి నుంచి అమలు చేస్తారు?
Stop Clock Rule..! క్రికెట్ మ్యాచ్ ను టైమ్ లిమిట్ లోగా పూర్తి చేసేందుకు International Cricket Council తీసుకురాబోతున్న నిబంధన. గత డిసెంబర్ నుంచి Stop Clock Ruleను కొన్ని మ్యాచుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అది సక్సెస్ అవడంతో పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఐసీసీ డిసైడయింది. జూన్ లో జరిగే T20 World Cup నుంచి Stop Clock Ruleను మనం చూడబోతున్నాం.
ఈ రూల్ లో ఏం ఉంది:
ఇంతకూ ఈ రూల్ ఏంటంటే.. ఓవర్లకు ఓవర్లకు మధ్య Electronic Watchను చూపిస్తారు. నిర్ణీత సమయంలోగా ఓవర్ల కోటా పూర్తి చేసేలా రెండు టీంల కెప్టెన్లను Stop Clock Rule అలర్ట్ చేస్తుంది. అలాగే ఫీల్డింగ్ చేసే టీంకు ఓవర్ కు ఓవర్ కు మధ్య 60 సెకన్ల టైం ఇస్తారు. ఆలోగా కొత్త ఓవర్ మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ అలా చేయకపోతే అంపైర్ రెండు సార్లు వార్నింగ్ ఇస్తాడు. అయినప్పటికీ ఓవర్ వేయకపోతే.. ఫీల్డింగ్ జట్టుకు 5 రన్స్ పెనాల్టీ విధిస్తారు.
మరి కొద్ది నెలల్లో Stop Clock Rule అమల్లోకి రాబోతోంది. మరి ఇది ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుంది? ఏయే టీంలు పెనాల్టీ బారిన పడతాయి? ఇలాంటివన్నీ చూడాలంటే టీ-20 వరల్డ్ కప్ వరకు ఆగాల్సిందే.
- పి. వంశీకృష్ణ