SFA (స్పోర్ట్స్ ఫర్ ఆల్) ఛాంపియన్‌షిప్స్ 2024లో భాగంగా 7వ రోజు హైదరాబాద్‌లోని పలు స్టేడియంలు అథ్లెటిక్ స్పూర్తితో నిండిపోయాయి. ఇందులో భాగంగా గచ్చిబౌలి స్టేడియం, శ్రీ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో యువ క్రీడాకారులు విభిన్న క్రీడల్లో తన నైపుణ్యాలను ప్రదర్శించారు.
బాస్కెట్‌బాల్, చెస్‌తో పాటు హ్యాండ్‌బాల్, వాలీబాల్, అథ్లెటిక్స్ జోరు పెంచాయి. అండర్-11 బాలుర విభాగంలో చెస్ క్రీడాకారులు వ్యూహాత్మక ముఖాముఖీలను ఆస్వాదించడంతో పాటు హ్యాండ్‌బాల్, వాలీబాల్ మొదటి, రెండవ రౌండ్లు ప్రారంభమయ్యాయి.
వీటితో పాటు అథ్లెట్లందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లాంగ్ జంప్, షాట్‌పుట్‌లో ఉత్కంఠభరితమైన ఫైనల్స్, 100 మీటర్ల స్ప్రింట్‌లు ముగిశాయి. బాలుర అండర్-12 లాంగ్ జంప్‌లో విగ్నాన్స్ బో ట్రీ స్కూల్‌కు చెందిన హర్వీష్ శ్రీ చిరికి స్వర్ణం సాధించి తన పాఠశాలకు గర్వకారణంగా నిలిచాడు.
సన్‌సిటీ గ్లెన్‌డేల్ అకాడమీకి చెందిన ఒమర్ అలీ బాలుర అండర్-18 షాట్‌పుట్ (5 కేజీలు)లో స్వర్ణం సాధించగా, బాలికల అండర్-12 లాంగ్ జంప్‌లో సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన శ్రీ సాయి అనన్య ఒడియాల స్వర్ణం సాధించి క్రీడా స్పూర్తిని ప్రద్వించారు.
అథ్లెటిక్స్ విభాగంలోని 2, 3 రోజుల్లో అథ్లెట్ల ఉత్సాహం మరిం తపెరిగింది. రాబోయే ఇతర ఈవెంట్‌లలో భాగంగా రేపు మరిన్ని 100మీ స్ప్రింట్ ఫైనల్స్ జరగనున్నాయి.
శ్రీ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలోని పోటీల్లో భాగంగా బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్స్‌తో పాటు టైక్వాండో బౌట్‌లు జరగగా..ఈ పోటీలను ప్రేక్షకులు ఉత్సాహంగా ఆస్వాదించారు. తైక్వాండోలో బాలుర అండర్-14 విభాగంలో ది ఇంటిగ్రల్ స్కూల్‌కు చెందిన సల్మాన్ మాలిక్, బాలికల అండర్-14 విభాగంలో న్యూటన్ హైస్కూల్ (మోతీనగర్)కు చెందిన తిరుమణి గెలుపొందారు.
లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో అండర్-14 ఫుట్‌బాల్ రౌండ్‌లలో జట్లు మధ్య ఉత్కంఠభరిమైన పోటీ కొనసాగింది. ముఖ్యంగా SFA ఛాంపియన్‌షిప్‌లలో టాలెంట్ హంట్ కోసం ఔత్సాహిక ఫుట్‌బాల్ ఆటగాళ్లను నమోదు చేసుకునేందుకు వీలుగా.. యువ ఫుట్‌బాల్ ప్రతిభను గుర్తించడానికి మరియు ఒక వేదికను అందించడానికి TV9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలోని ‘ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్స్’ చొరవతో SFA భాగస్వామిగా మారింది.
-ఈ సంవత్సరం హైదరాబాద్ ఎడిషన్ SFA ఛాంపియన్‌షిప్స్‌లో భాగంగా 22 క్రీడా విభాగాల్లో 920 పాఠశాలల నుండి 23,000 మంది క్రీడాకారులు పోటీపడుతున్నారు. ఛాంపియన్‌షిప్‌లు అక్టోబరు 28 వరకు కొనసాగుతాయి. యువ క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక వేదికను సృష్టించడంతోపాటు పాఠశాలలకు పతకాల పట్టికలో అగ్రగామిగా నిలిచేందుకు అవకాశం కల్పిస్తుంది.
-అట్టడుగు స్థాయి క్రీడలను ఔత్సాహికులకు వృత్తిగా మార్చడం, ఆర్థిక స్వాలంబన కోసం SFA యొక్క మిషన్‌లో భాగంగా.., ఛాంపియన్‌షిప్‌లు అట్టడుగు స్థాయి క్రీడలలో పెట్టుబడిని ప్రోత్సహించే సంస్కృతిని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ బహుళ వేదికల పోటీలను హైదరాబాద్‌లో ప్రత్యక్షంగా కూడా వీక్షించవ